ఇంట్లో చట్నీ, కూరలు , చేసేటప్పుడు, టొమోటో, కంద, బచ్చలికూర, చింతకాయ పచ్చడిలాంటి అనేక కూరలకి సపోర్టుగా ఈ మసాలా క్యాప్సికమ్ ను నంజుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది.
కాయలు, కాయలు తెలియకుండా తినేస్తాం, అలాంటి ఈ మసాలా క్యాప్స్కమ్ కి కావాలసిన పధార్థాలు.
వంటకు కావాలిసిన పధార్థాలు :
క్యాప్సికమ్ : 100 గ్రాములు ఉల్లిపాయలు : 50 గ్రాములు వేయించిన శనగపప్పు (పౌడర్) :25 గ్రాములు పసుపు : కొద్దిగా కారం : కొద్దిగా కొత్తిమీర : చిన్నది 1 గరంమసాలా : చిటికెడు ఆయిల్ : 50 గ్రాములు లోపు ఉప్పు : తగినంత టోమోటోలు : పెద్దది 1 తయారీ చేయువిధానం : బెంగుళూరు మిరపకాయను మధ్యలో చీల్చి లోపలున్న విత్తనాలను తీయండి క్యాప్సకమ్ లోపల (సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలును వేయించిన శెనగపప్పు పౌడర్ను ,కారం, గరంమసాలాపొడి, కొత్తిమీర, ఉప్పు, పసుపులను వీటిన్నటినీ కలపగా వచ్చిన మిశ్రమం కూరండి. ఓ గిన్నెలో వాటిని అమర్చి నూనె పోసి తిప్పండి. పై మూత మీద కొద్దిగా నీళ్లు చల్లండి. దాని వల్ల బాగా మగ్గి రుచికరంగా తయారువుతుంది. ఇకమీద భోజనంతోగానీ, ఇష్టమైతే చపాతీ, రోటీ ఐటమ్స్ లో కాని తీసుకోండి బైటికి తీసిన క్యాప్స్కమ్ చుట్టు టొమోటో స్లైస్ ల అమర్చి డైనింగ్ టేబుల్ మీదకు చేర్చండి. ఇది రోటీ ఐటమ్స్ కి భోజనంలో గాని బావుంటుంది. మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: