మటన్ జీడిపప్పు!

Durga
మటన్ : పావుకేజీ జీడిపప్పు : వంద గ్రాములు గసాలు : వంద గ్రాములు కర్బూజా గింజలు : పావు కప్పు కొబ్బరి : పావుకప్పు టమాటాలు : రెండు కారం : టీ స్పూన్ ఉప్పు : సరిపడా పసుపు : పావు టీ స్పూన్ నూనె : అర కప్పు ఉల్లి పాయ : ఒకటి పచ్చిమిర్చి : మూడు అల్లం ముక్కలు : టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు : టేబుల్ స్పూన్ కొత్తిమీర : చిన్న కట్ట వెన్న : అర కప్పు గరం మషాలా : అర టీ స్పూన్ తయారుచేయు విధానం :  
  • జీడిపప్పులు, కర్బూజా గింజలు, గసాలు, కొబ్బరి అన్నివిడివిడిగా నూనె లేకుండా వేయించి అన్ని కలిపి మిక్సిలో వేసి కొద్దిగా నీళ్ళు చేర్చి పేస్టులా చేయాలి.
  •    
  • స్టవ్ ఫై కళాయిపెట్టి రెండు స్పూన్ల నూనెవేసి వేడి అయ్యాక, జీడిపప్పు పేస్టు వేసి కాసేపు వేగనిచ్చి కొద్దిగా కారం, పసుపు, కొంచెం ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఐదు నిముషాలు వుడకనిచ్చి గ్రేవీ తయారు చేసుకోవాలి.
  •    
  • టమాటాలు ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నూనెలో ఉడకనివ్వాలి. వీటిని చల్లార్చి వీటికి కొద్దిగా జీడిపప్పులు కలిపి మిక్సి వేస్తె టమాట ప్యూరి రెడీ అవ్వుతుంది.
  •  
  • మటన్ కి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి నీళ్ళు యిగిరిపోయే వరకు ఉడికించికోవాలి.
  •  
  • స్టవ్ మీద కళాయిపెట్టి వెన్న వేడిచేసి అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేగాక, పచ్చిమిర్చిముక్కలు, ఉల్లి ముక్కలు వేసి వేపాలి. వేగాక ఉడికించిన మటన్ వేసి మూడు నిముషాలు కలిపి ఉప్పు, కారం వేసి తయారుచేసిన జీడిపప్పు గ్రేవీ {సుమారు వంద గ్రాములు} వేసి రెండు నిముషాలు కలిపి మూడు టేబుల్ స్పూన్లు టమాట ప్యూరి వేసి కలుపుతూ వుడకనివ్వాలి. గ్రేవీ యిగిరి కూర తయారు అయ్యిన తరువాత గరంమషాలా, కొత్తిమీర చల్లి స్టవ్ ఆపాలి. * అంతే మటన్ జీడిపప్పు కూర రెడీ.
  • మరింత సమాచారం తెలుసుకోండి:

    సంబంధిత వార్తలు: