విజయం మీదే: వ్యాపారం లో ఇలా డెవలప్ అవ్వండి ?

VAMSI
గతంలో అయితే వ్యాపారం చేసే వారు తక్కువ.. కానీ ఈ రోజుల్లో వ్యాపారం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే వ్యాపారం లో విజయం అందు కోవడం అంటే అంత సులభం కాదు. వ్యాపారం అన్నాక దాదాపుగా అన్ని రకాల వ్యాపారాలకు ఎంతో కొంత పెట్టుబడి అనేది అవసరం. అయితే అనుకున్న విధంగా వ్యాపారం సాగి లాభాలు పొందాలి అంటే అంత సులభం కాదు. అనుకున్న ఫలితాలు అంటే కొన్ని వ్యాపార ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి. అందులో ముందుగా ప్రజలను ఆకర్షించడం చాలా ముఖ్యం. కస్టమర్స్ ను ఆకర్షించడం చాలా ప్రదానం. కస్టమర్స్ ను మన వ్యాపారం వైపు తిప్పుకోవడానికి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.
మన వ్యాపారం గురించి అందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.  కస్టమర్స్ ను ఆకర్షించే విధంగా మన షాప్ కి లేదా సదరు వ్యాపారానికి అలవాటు పడే వరకు నష్టం రాకుండా లాభం కోసం ఎక్కువగా ఆరాట పడకుండా  వీలయినంత వరకు భారీగా డిస్కౌంట్ లు, ఆఫర్లు వంటివి పెట్టాలి. ఇలా పలు విధాలుగా కస్టమర్లను ఆకర్షిస్తూ అలవాటు పడేలా చేయాలి.
మీ ఏరియాకు తగిన విధంగా వ్యాపారాన్ని మలుచుకోవడం చాలా అవసరం... మీ కస్టమర్స్ తో ఎప్పుడూ ఎంతో ప్రేమతో మెలగాలి. వ్యాపారానికి సంబంధించి ఎప్పుడైనా కస్టమర్స్ దేవుళ్ళు అన్న భావన మీ మనసులో ఉండాలి. అప్పుడే మీ షాప్ కి రావడానికి ప్రజలు ఇష్టపడుతారు.
అంతే కాకుండా మీరు ఉన్న ఏరియా లో మీకు పోటీగా ఏమైనా షాప్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే... వారికి మించి కస్టమర్లను ఏ విధంగా ఆకట్టుకోవాలి అన్న విషయం గురించి ఒక ప్రణాళిక వేసుకోవాలి.
ఇలా మీరు వ్యాపారం స్టార్ట్ చేసినప్పటి నుండి అన్ని విషయాలను గమనించుకుంటూ మెల్ల మెల్లగా అభివృద్ధి చేసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: