విజయం మీదే: అందరూ నిన్ను వెనక్కు లాగే వాళ్ళే... జాగ్రత్త ?

VAMSI
నిస్పృహతో ఆగిపోయి పరాజయాన్ని స్వీకరించడమా లేక దైర్యంగా ముందుకు నడిచి కోరుకున్న విజయాన్ని అందుకోవడమా ... రెండింటిలో ఏ నిర్ణయం అన్న దానిపై మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే తాము అనుకున్న దారిలో వెళుతున్నప్పుడు మనమంటే ఓర్చుకోలేని వారు కురిపించే విమర్శలకు కుంగిపోయి నిరాశ చెంది పయనాన్ని ఆపేస్తుంటారు . మరి కొందరు ఇంకొంత బలంగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో ఇతరులు మనల్ని అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటారు ఎన్నో ఆటంకాలను కలిగిస్తుంటారు. కాగా అటువంటి వాటికి భయపడి మార్గ మధ్యంలోనే వెనుతిరుగుతుంటారు ఇంకొందరు.
అయితే ఇలాంటి వారి కోసం అనుభవజ్ఞులు చెబుతున్న ఒక మంచి మాట.  ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలు , అడ్డంకులు ఎన్నో ఉంటాయి. అయితే, వాటిని పట్టించుకుని మనసును కష్టపెట్టేలా ఆలోచించి ఆగిపోవాలా లేదా వాటితో మనకేంటి పని అని పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలా అనేది మాత్రం నువ్వు తీసుకునే నిర్ణయం లోనే  ఉంది. దైర్యం చేసి ముందుకు  కదిలితే నువ్వు వేసే ఒక్కో అడుగు నిన్ను విజయం వైపునకు నడిపిస్తూ దూరాన్ని తగ్గిస్తుంది.  అలాగే మరో వైపు నుండి నీ దైర్యాన్ని చూసి నిన్ను భయపెట్టాలనే విమర్శలు కూడా మరింత పెరుగుతాయి. అయినా సరే వాటిని పట్టించుకోకుండా అవన్నీ పక్కన పెట్టి నీ పయనాన్ని కొనసాగిస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా నీ సొంతమవుతుంది.
అలా కాకుండా ఆ విమర్శలకు భయపడుతూ నీ అడుగు వెనకకు పడితే నీ పతనం మొదలైనట్లే... నీ ప్రతి వెనకడుగు పతనానికి దారి తీస్తుంది నీ భవిష్యత్తు నీ శూన్యం గా మారుస్తుంది. అందుకే ధైర్యంగా ముందుకు వేసి విజయాన్ని అందుకోవడమా? లేక ధైర్యం కోల్పోయి వెనకడుగు వేసి నీ పతనాన్ని నువ్వే అంగీకరించడమా అనేది నీ చేతుల్లోనే ఉంది. విజయం నీ ముందే ఉంది కానీ కావలసిందల్లా దాన్ని అందుకోవడానికి నీ ధైర్యం మాత్రమే అన్నారు పెద్దలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అనుసరిస్తే  సక్సెస్ నీ సొంతమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: