విజయం మీదే: స్వార్ధంగా జీవించకు... నాశనమే?

VAMSI
ఈ సమాజములో ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. మనుషుల్ని పాటించుకునే వారే కరువయ్యారు. మానవత్వమే కనుమరుగై పోయింది.  రాను రాను మానవత్వానికి విలువ లేకుండా పోతుంది. ఎవరు...ఎవరిని పట్టించుకోవడం లేదు. ఈ ప్రపంచంలో స్వార్దం మాత్రమే రాజ్యం ఏలుతోంది. ఎవరి లక్ష్యం కోసం వారు పరుగులు తీస్తున్నారు, వారి వారి వ్యక్తిగత జీవితం కోసం కుటుంబం కోసం ఆరాట పడుతూ ఎవరికి ఏమైనా మనకెందుకులే అనుకుని స్వార్దంగా మారిపోతున్నారు. అనుకున్నది ఎలాగైనా సాధించి విజయాన్ని అందుకోవడం కాదు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండలేక పోయిన అందరికీ వ్యతిరేకంగా, అసంతృప్తిగా అయితే అస్సలు ఉండకూడదు.
అందుకునే విజయం లోనూ న్యాయం ఉండాలి. అపుడే ఆ విజయం నిజమైన ఆనందాన్ని మీకు పంచగలదు, నలుగురిలో మీ గౌరవాన్ని మరింత పెంచగలదు. అలాంటి విజయానికి మాత్రమే సరైన గౌరవం, ఆదరణ, గుర్తింపు లభిస్తాయి. ఒకరిని మోసం చేసి, లేదా కష్టపెట్టో నేడు నువ్వు అనుకున్నది సాధించి సంతోషంగా జీవించవచ్చు. కానీ ఏదైతే నువ్వు మోసంతో అందుకున్నావో రేపు అంతకు రెండింతలు పోగుట్టుకుంటావని పెద్దలు అంటుంటారు. ఇది నిజమో కాదో అన్న సంగతి పక్కన పెడితే నీ మనస్సాక్షి మాత్రం ఎప్పుడూ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. నీ తప్పులు నీకు ఎత్తి చూపుతూనే ఉంటుంది .
అటువంటి పరిస్థితి నీకు అవసరమా? సాధించిన దానితో నువ్వు సుఖంగా సంతోషకంగా లేనప్పుడు వృధానే కదా. పైగా అలా దక్కిన విజయంతో ఎలా ప్రశాంతంగా ఉండగలవు. సంతోషంగా జీవించగలం. పొరపాట్లు సహజమే కాని తప్పులు అని తెలిసి కూడా కంటిన్యూ చేయకూడదు. మరి ఈ క్షణమే నీలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా? స్వార్థంగా ఆలోచిస్తున్నారా లాంటి విషయాలను సరిగా చెక్ చేసుకుని, ఒకవేళ మీరు స్వార్ధ పరులు అయితే రేపటి నుండి ఈ లక్షణాన్ని విడనాడి మంచి మార్గంలో ప్రయాణించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: