విజయం మీదే: "ఇరుగు - పొరుగు" వారి మనసును ఇలా గెలుచుకోండి ?

VAMSI
సమాజంలో ప్రతి ఒక్కరూ తోటి వారితో మంచిగా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఉండే బిజీ కారణంగా ఉండలేకపోతున్నారు. మనం ఎదుటి వారితో మంచిగా ఉన్నాము, అంటే అలాగే ఎదుటివారు కూడా మనతో అంతే మంచిగానే ప్రవర్తిస్తారు. ఇరుగు పొరుగుల మధ్య లేదా మన చుట్టూ ఉండేవారి తోను ఏదో ఒక సంద్భంలో తప్పక మనస్పర్థలు వస్తుంటాయి, వాటిని మనసులో పెట్టుకుని వారితో సరిగ్గా మెలగపోతే వాళ్లు కూడా మనతో అలాగే ఉండిపోతారు. అయితే వాస్తవానికి అలా ఉండటం మంచిది కాదు. ప్రతి ఒక్కరితో మనం ఎప్పుడు మంచిగా స్నేహభావంతో అనవసరంగా కొట్లాటకు గొడవలకి వెళ్లకుండా ఉండటం మంచిది.
అయితే అందరితో మంచిగా  స్నేహంగా ఎలా ఉండాలి అనే దాని గురించి  మనం ఇప్పుడు చెప్పుకుందాం. అలాగే మనం ఏ విధంగా ఉంటే గొడవలు రాకుండా మంచిగా ఉంటారో కూడా చూద్దాం. అంతే కాకుండా అందరితో మంచిగా గొడవలు లేకుండా ఇంకా ఏటువంటి ఇబ్బందులు కూడా లేకుండా  ఎలా ఉండాలి..? అనే విషయాలు కూడా ఇక్కడ తెలుసుకుందాం.
గొడవలకు పోకుండా దూరంగా ఉండటం: మనం ఎలాంటి సమయంలో కూడా ఎదుటి వారితో గొడవలు పడకూడదు. గొడవలు పెట్టుకోవటం వల్ల ఇబ్బందులు వస్తాయి. అంతే తప్ప ఇంకేమి ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం కొంచెం మంచి మనసుతో సర్దుకుని ఉంటే ఎంతటి  సమస్య అయినా ఇట్టే పరిష్కరించబడుతుంది. ఇలా ఉన్నట్లయితే ఖచ్చితంగా గొడవలు రావు అనే చెప్పాలి.
ఎదుటి వారి స్వభావాన్ని అర్థం చేసుకోండి: మనం ఇతరుల గుణాన్ని కూడా అర్థం చేసుకోవటం అనేది చాలా ముఖ్యం.  అలాగే ఎదుటి వారు ఏదైనా మంచి పని చేసినప్పుడు వారిని తప్పకుండా  మెచ్చుకోవాలి. మనం ఇలా చేయడం వలన వాళ్ళకి మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అలాగే మనతో కూడా  మంచిగా మెలుగుతారు.
ఇతరులకు గౌరవం ఇవ్వండం:- మనం మనకన్నా చిన్న పెద్ద అనే బేధం లేకుండా అందరితో కూడా గౌరవంగా మర్యాదగా మెలగాలి. అలాగే ఇతరులు మనం చెప్పిన మాట వినాలి అని అనుకుంటే మాత్రం మనం కూడా తప్పకుండా  వారి మాట వినాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఏర్పడుతుంది.
తప్పుని అంగీకరించడం:- పొరపాటున మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మనం దానిని ఒప్పుకుని తీరాలి. ఇలా చేయటం వలన ఎదుటివారికి మన మీద  సానుభూతి ఏర్పడుతుంది. అలాగే మనం ఆ తప్పుకి క్షమాపణ చెప్పాలి.
చూశారు కదా పైన చెప్పిన విధంగా చేసినట్లయితే కచ్చితంగా మనం ఇతరులతో ఏటువంటి గొడవలు మనస్పర్థలు లేకుండా ఇరుగు పొరుగు వారితో ఎంతో మంచిగా మెలగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: