విజయం మీదే: సమస్యకు భయపడుతున్నారా... అయితే ఈ కథ చూడండి?
ఒక వ్యక్తి తనకి వచ్చిన కష్ట నష్టాల గురించి తన తల్లితండ్రులకు చెప్పి బాధపడుతూ తనకి వచ్చిన సమస్యలకి ఏదైనా ఒక పరిష్కారం చెప్పమని అడుగుతాడు. దానికి తన తల్లితంద్రులు బాగా ఆలోచించి తనని మూడు పాత్రలు అలాగే ఆలుగడ్డ, ఎగ్ ఇంకా కాస్త కాఫీ పొడి గింజలను తీసుకుని రమ్మని చెప్తారు. అతను ఆశ్చర్యానికి లోనయ్యి వాళ్ళు చెప్పినవి అన్ని తీసుకు వస్తాడు. ఇప్పుడు తన తల్లితండ్రులు ఒక్కో పాత్రని ఒక్కో పోయిమీద పెట్టి వాటిలో కాసిన్ని నీళ్ళు పోసి ఒక్కో పాత్రలో ఒక్కొక్కటిగా ఆలుగడ్డ, ఎగ్గ్ ఇంకా కాఫీ గింజలను వేయమని చెప్తారు. ఆ వ్యక్తి అలాగే చేస్తాడు.
కాసేపు అయ్యాక వాటిని పొయ్యి మీద నుంచి దించి వాటిని ఒక్కొక్కటిగా రుచి చూడమని చెప్తారు, అతను అలాగే చేస్తాడు. అప్పుడు వాళ్ళు వాటి మీద తన అభిప్రాయాన్ని అడుగుతారు, దానికి అతను ఆలుగడ్డ మెత్తగాను, ఉడికిన ఎగ్ కొంచెం గట్టిగాను అలాగే కాఫీ గింజల నీటిలో పూర్తిగా కరిగిపోయాయి అని చెప్తారు. ఇది విన్న తన తల్లితండ్రులు చూసావా మొదట ఆలుగడ్డ గట్టిగా, ఉడికిన తర్వాత మెత్తగాను అలాగే ముందు సున్నితంగా జారుగా ఉన్న ఎగ్ ఇప్పుడు కొంచెం గట్టి గా ఇంకా కాఫీ గింజలు పూర్తిగా నీళ్లలో కరిగిపోయి మంచి రుచి సువాసనగాను తయారయ్యాయి. దీనికి కారణం వాటిని వేడి చేయటం.
అలాగే మనం కూడా మనం చేసే పనిలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయక మనల్ని మనం మార్చుకుని విజయం వైపు ముందుకు సాగాలి. అలాగే మన మనస్సు దైర్యంగా ఇంకా దృఢ నిశ్చింతగా ఉండాలి. అప్పుడే ఎటువంటి అవాంతరాలకు మనం లొంగకుండా ఉండగలము. ఇలా ప్రయత్నించినప్పుడు మాత్రం
తప్పక విజయం సాధిస్తాము. అలాగే మనం చేసే పనిలో కూడా ఫలితం ఉంటుంది. అని తన తల్లితండ్రులు చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి ఎంతో సంతోషిస్తాడు.
సో చూశారుగా మనకి కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా దైర్యంగా అలాగే దృఢత్వాం తో ఉంటే కచ్చితంగా విజయం సాధిస్తారు.