విజయం మీదే: డబ్బే జీవితమా... ?

VAMSI
ప్రస్తుతం మనము బ్రతుకుతున్న జీవన శైలిలో డబ్బు సంపాదన అనేది అందరి ప్రధాన మరియు ప్రథమ లక్ష్యంగా మారి పోయింది. ఈ రోజుల్లో మీరు కనుక చూసుకుంటే డబ్బుకు ఇచ్చే విలువ మనిషికి దొరకడం లేదని చెప్పాలి. పూర్తిగా సమాజం మొత్తం ఇలాగే ఉందని చెప్పలేము. అదే సమాజంలో బాగా ఆర్దికంగా స్థిరపడ్డ వ్యక్తికి దక్కే గౌరవమే వేరు. ప్రశాంతంగా జీవించాలి అన్నా, ఆర్దికంగా బాగా స్థిరపడి అన్ని వసతులతో సంతోషంగా జీవించాలి అన్నా,  కోరుకున్న జీవితం ఆస్వాదించాలి అన్నా , తమ పిల్లల్ని అనుకున్న విధంగా ఎటువంటి లోటు లేకుండా పెంచాలన్నా డబ్బు చాలా చాలా అవసరం. 

అందుకే డబ్బు అంటే అందరికీ వ్యమోహంగా ఉంటుంది. డబ్బును సంపాదిస్తే తాము విజయం అందుకున్నట్లు అని చాలా మంది భావిస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివినా, ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా డబ్బుని సంపాదించడమే ముఖ్య లక్ష్యంగా అనుకుంటున్నారు చాలా మంది. అందుకే డబ్బు అంటే అంత ఆరాటం. చేతిలో 100 రూపాయలు ఉంటే దాన్ని ఎలా 500 చేయాలా అన్న ఆలోచనే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే డబ్బు మాత్రమే జీవితం కాదు, డబ్బుకు మించి విలువైనవి జీవితంలో ఎన్నో ఉన్నాయి.

 
కానీ డబ్బు కూడా అవసరమే. అయితే డబ్బును సంపాదించడం ఎలా అన్న ఆలోచనలో పడుతున్నారు. కానీ ఉన్న డబ్బును పొదుపుగా వాడు కోవడం ఎలా అన్న విషయం గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఉన్న డబ్బును దుబారా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. ముఖ్యంగా సుఖ శాంతులతో ఆనందంగా ఆహ్లాదంగా ఉండే  ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ దేవి నాట్యం ఆడుతూ ఉంటుంది. మరియు జీవితంలో ఎక్కువ భాగం డబ్బులే ప్రాధాన్యత ఇవ్వకుండా, కష్టాలలో తోడు నీడగా ఉండే బంధాలు, బంధుత్వాలు అన్నింటినీ గుర్తుంచుకుని ప్రవర్తించండి. మీకు అంతా మంచే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: