విజయం మీదే: చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేశారా... ఫసక్?

VAMSI
అనుకున్నది సాధించి విజయాన్ని అందుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉండడం సహజమే. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది మన జీవన విధానంలో ప్రతీది కౌంట్ అవుతుంది. కొన్నిసార్లు చిన్న అంశాలు కూడా మన లక్ష్యానికి అవరోధాలను కలిగిస్తాయి. అయితే చాలా మంది కొన్ని కొన్ని విషయాలను చిన్నవే కదా ఇదేముంది చాలా లైట్ గా తీసుకుంటారు. అయితే అలాంటివే పెద్ద తలనొప్పిని తీసుకొచ్చి పెడతాయి. లక్ష్యాన్ని చేదించాలి అంటే అన్నిటినీ దృష్టిలో ఉంచుకోవాలి. చాలా మంది పనిలో పడి నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. పనిలో పడి నిద్ర పోరు. కానీ ఇలా చేయడం కూడా మీకు హాని కలిగిస్తుంది.
కొందరు పగలంతా పని చేసి రాత్రుళ్ళు ఫోన్ పట్టుకు కూర్చోవడం, ఒత్తిడి వలన, పదే  పదే ఆలోచిస్తూ  నిద్రపోకుండా అర్దరాత్రి వరకు అలా కాలయాపన చేస్తూ సరిగా నిద్రపోరు. అయితే ఈ నిద్రలేమి మన ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుంది అన్నది అందరికీ పూర్తిగా అర్దం కావడం లేదు. నిద్ర లేమి వలన ఎప్పటికప్పుడు పెద్దగా నష్టం జరగకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. మనిషి ఆరోగ్యంగా సంతోషంగా లేనపుడు అనుకున్నది ఎలా సాధించగలరు. ప్రస్తుత జీవన విధానం లో ప్రతి రోజూ పూర్తి చేయడం ఒక లక్ష్యమే.
అనుకున్న పని పూర్తి చేయాలి, ప్రశాంతంగా పని జరగాలి, అందరితోనూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా ముందుకు సాగాలి. క్షేమంగా ఆ రోజు మన రోజు గడవాలి. ఇలా ప్రతీది పోరాటమే...ఆ పోరాటాన్ని జయించడం లక్ష్యమే. ఇక నిద్రలేమి వలన మనస్సు ప్రశాంతంగా ఉండదు, ఏవేవో ఆలోచనలు, విసుగు చిరాకు ఇవన్నీ కలిసి మనకు మన విజయాన్ని దూరం చేయగలవు. అందుకే దీన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి అన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: