ఆ రెండు సినిమాలు వదులుకోవడంతో.. ఇప్పటికీ ఫీల్ అవుతున్న ఎన్టీఆర్..!

Divya
తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ పేరు, పాపులారిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉంటూ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న ఎన్టీఆర్ తన కెరియర్లో కథ విన్న తర్వాత సినిమా చేయానని చెప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట. కానీ అందులో రెండు చిత్రాలు మాత్రం తనకి కథ నచ్చిన కూడా పాత్రకు సెట్ కాదని వదిలేసిన సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు తాను ఎందుకు చేయలేదని ఇప్పటికీ ఫీల్ అవుతున్నారట ఎన్టీఆర్. మరి ఆ సినిమా పేర్లు ఏంటో చూద్దాం.



ముఖ్యంగా అలాంటి సినిమాలలో కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కథ మొదట డైరెక్టర్ అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ కలిసి జూనియర్ ఎన్టీఆర్ కి కథ వినిపించగా జూనియర్ ఎన్టీఆర్ తనకంటే ఈ సినిమాకి సోదరుడు ( కళ్యాణ్ రామ్ ) కరెక్ట్ గా సరిపోతారని కథ విన్న తర్వాత కళ్యాణ్ రామ్ ని ఒప్పించి మరి సినిమా చేయించేలా చేశారు. మరో సినిమా బొమ్మరిల్లు. ఈ సినిమా కథ ఎన్టీఆర్ కి నచ్చినప్పటికీ అందులో హీరో పాత్ర తనకు సెట్ కాదని ఈ సినిమాలో అంగీకరించలేదు. కానీ బొమ్మరిల్లు సినిమా చేయకపోవడం ఇప్పటికీ బాధగానే ఉందంటూ ఎన్నో ఇంటర్వ్యూలలో తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్.


జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దేవర 2 సినిమాకి సంబంధించి పనులు జరుగుతున్నాయని ఎన్టీఆర్ లేకుండా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించే కొరటాల శివ ప్లాన్ చేసినట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ అన్ని కలిసి వస్తే ఈ రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. చివరిగా ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటించిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదని తెలుస్తోంది. మరి డ్రాగన్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: