విజయం మీదే: తక్కువ పెట్టుబడితో నెలకు 50 వేలు మీవే ?

VAMSI
ఒక మనిషి వృద్ధిలోకి రావాలంటే చాలా మార్గాలు ఉంటాయి. కానీ ఎక్కువ మంది డబ్బున్న వారు వ్యాపారం ద్వారా ఇంకా అభివృద్ధి చెందాలని అనుకుంటూ ఉంటారు. అయితే వ్యాపారంలో మంచి లాభాలు గడించాలంటే అంత సులభమైన విషయం కాదు. దాని కోసం ఎంతో కష్టపడి ఎన్నో ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి. అయితే అన్ని వ్యాపారాలు అందరూ చేయడం కుదరని పని. ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వారు వ్యాపారాలను చేసుకుంటూ ఉంటారు. కానీ కొందరిలో ఒక భావన ఏర్పడి ఉంటుంది. వ్యాపారం అంటే అది పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం.
ధనవంతులు మాత్రమే చేయగలరు అనే ఫీలింగ్ లో ఉంటారు. కానీ అది అవాస్తవం వ్యాపారం అనేది ఒక వస్తువును మనము తయారు చేసి వేరొకరికి అమ్మడమే వ్యాపారం. అంతకు ముందు ఏమీ లేదు. ఇప్పుడు మనము తక్కువ పెట్టుబడితో నెలకు లాభాలు ఎలా పొందవచ్చు అనేది చూద్దాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని రాబట్టే వ్యాపారం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అయితే ఇలాంటి వారికి మినరల్ వాటర్ ప్లాంట్ వ్యాప్తం సరిగ్గా సూట్ అవుతుందని నిపుణుల అభిప్రాయం. నేటి కాలంలో మీరు టౌన్ కానీ పల్లె కానీ ఎక్కడ చూసినా బోరు లేదా కుళాయి నీటిని తాగడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు.
అందరూ మినరల్ వాటర్ పై మక్కువ పెంచుకున్నారు. వారి ఇష్టమే మన ఆదాయ మార్గం అని తెలుసుకోండి. ఈ వ్యాపారం స్టార్ట్ చేయడానికి మీరు కేవలం 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మరియు ఈ ప్లాంట్ ను నెలకొల్పడానికి కనీసం 1500 చదరపు అడుగుల స్థలం కావాల్సి వస్తుంది. అప్పుడు వాటర్ ప్లాన్ పెట్టుకుని కనీసం గంటకు 1000 లీటర్ల నీటిని మీరు సరఫరా చేయగలిగితే నెలకు 50 వేల రూపాయల వరకు ఈజీ గా సంపాదించుకోవచ్చు. మీరు ఇదే నీటిని బాటిల్ లో ఫిల్ చేసి వాడుకోవచ్చు మరియు క్యాన్స్ ద్వారా ఇంటింటికీ తిరిగి కూడా అమ్ముకునే సౌలభ్యం ఉంటుంది. ఇలా చేస్తూ వెళితే పెట్టిన పెట్టుబడి మీకు సంవత్సరం లోపు తిరిగి పొందగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: