విజయం మీదే: కరోనాను తరిమి కొట్టాలంటే... ?

VAMSI
గత రెండు సంవత్సరాలుగా ఎక్కడ ఎవరి నోట విన్నా కరోనా మహమ్మారి గురించే చర్చ. అదేదో మనం ఇంట్లో ఒక వ్యక్తిలాగా దాని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే అది మన మధ్యే ఉంటూ చాలా సింపుల్ గా మనుషుల ప్రాణాలను బలిగొంటూ రక్కసిలా వ్యవహరిస్తోంది. అయితే ఈ దారుణానికి కొంచెం గ్యాప్ వస్తే అంతా పోయింది అనుకున్నాము. కానీ అది మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో సెకండ్ వేవ్ మరియు థర్డ్ వేవ్ అంటూ ఇబ్బంది పెడుతోంది. అయితే దీన్ని ఎలాగయినా నాశనం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. ఇపుడు మరోసారి ఒమిక్రాన్ అంటూ మానవజాతిపై తన ప్రతాపాన్ని చూపెడుతోంది.


ఇప్పుడు ప్రజల గుండెల్లో దీని పేరు వింటేనే రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడు మనల్ని ఇది ఎటాక్ చేస్తుందో అని భయపడుతూ బ్రతుకుతున్నారు. కానీ మనము భయపడటం అటు ఉంచి కరోనా మూడవ వేరియంట్ అయిన ఒమిక్రాన్ ను వెళ్లగొట్టాలంటే ఇలా చేయండి.  ఇందుకు ముందుగా మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.

మానవుని సైకాలజీ ప్రకారం ఎంతటి వ్యాధి లేదా జబ్బు అయినా దాని ప్రభావం కొంత వరకు మాత్రమే చూపిస్తుంది. కానీ అంతకు మించి ఆ వ్యాధి గురించి భయపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు కరోనా గురించి భయపడక్కర్లేదు. దైర్యంగా ఉండండి, ఈ భూమిపైన ఎవ్వరూ కూడా చనిపోకుండా ఉండరు. అందరూ ఏదో ఒకరోజు వెళ్లిపోయే వారే... అందుకోసం ముందు నుండి ఆలోచిస్తూ చస్తూ బ్రతకలేము కదా... కాబట్టి ఒమిక్రాన్ ఎంత ప్రమాదకారి అయినా భయం వద్దు. దైర్యంగా ఎదుర్కొండి.
ప్రభుత్వాలు చెబుతున్న నియమాలు అన్నింటినీ తూచా తప్పకుండా పాటించండి ఒక్క కేసు వస్తే అప్పుడు అడగండి.
1. మాస్కు ధరించండి.
2. శానిటైజర్ ను తప్పక వాడుతూ ఉండండి
3. బయటకు వెళ్ళినప్పుడు భౌతిక దూరం పాటించండి.
ఈ మూడు సరిగా పాటిస్తే ఒమిక్రాన్ మీ దరి చేరితే ఒట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: