విజయం మీదే: ఈ 2 పదార్ధాలను మీకు దూరంగా పెట్టండి?
కానీ పరిమితికి మించిన ఏ ఆహరం అయినా చాలా ప్రమాదం అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆహారం మితంగా తింటే ఔషదం, అతిగా తింటే విషం అన్నది సత్యం. అందుకే ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తప్పక అవసరం.
*ఇంట్లో వండిన ఆహార పదార్థాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
*ఉప్పును కాస్త తక్కువ తినడమే మంచిది. కరెక్ట్ గా తిన్నా పర్వాలేదు. కానీ ఎక్కువగా మాత్రం తినరాదు.
*చక్కెర లేదా బెల్లంతో తయారు చేసిన వంటకాలను బాగా తగ్గించాలి. కాఫీలు, టీ లు పదే పదే తాగడం మానేయాలి.
*పిండి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. వాటికి బదులుగా ఆకు కూరలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది బిపీలు, షుగర్లు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వ్యాధులు రావడానికి కారణం ఉప్పు, షుగర్ లాంటివి అధికంగా తీసుకోవడమే. ఇలాంటప్పుడు మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే నేటి నుండి మీరు తినే ఎటువంటి ఫుడ్ అయినా ఉప్పు మరియు షుగర్ లు అధికంగా లేకుండా చూసుకోండి. లేదంటే అతి తక్కువ వయసులోనే ఈ వ్యాధుల బారిన పడతారు.