విజయం మీదే: కష్టాలున్నాయా... ఈ కథ చదివి చూడండి?

VAMSI
మన ఆకాంక్షలో న్యాయం, నిజాయతీ ఉంటే సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సాధించాలనే తపన ఉండాలే కాని ప్రతిభ అందుకు కేంద్ర బిందువుగా మారి మన గమ్యాన్ని చేరుకోవడానికి సహాయం చేస్తుంది. ప్రతి మనిషి లోనూ ఎదో ఒక లోపం ఉంటుంది. కానీ ఆ లోపం వలన మన లక్ష్యానికి దూరం కాకూడదు. మన లోని బలహీనతలను కూడా బలంగా మార్చుకుని ముందుకు సాగినపుడే విజయాన్ని అందుకోగలరు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన ఒక యువతి కి డాక్టర్ కావాలన్నది తన కోరిక. అయితే కనీసం ఆ పాపకు మూడు పూటలా తిండి కూడా పెట్టలేని దుస్థితి ఆ తల్లి తండ్రులది. అయితే ఆ అమ్మాయి పట్టుదల చూసి తమ కుమార్తెను గవర్నమెంట్ హాస్టల్ లో చేర్పించారు.
అలా ప్రతి తరగతిని ఎంతో శ్రద్ధగా చదువుతూ తన లక్ష్యంపై గురి పెట్టుకుంది. అన్నిటిలోనూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతూ వచ్చింది. అలా ఉన్నత చదువులను పెద్దగా ఖర్చు లేకుండానే మంచి మార్కులు తెచ్చుకుని సీట్ తెచ్చుకుంటూ నెగ్గుకొచ్చింది. అంత మంచి మార్కులు రావడానికి ఆ అమ్మాయి రోజుకు 14 గంటల పాటు చదివేదట. అలా అందరి మన్నలను పొందుతూ  పట్టుదలతో శ్రమించి చివరికి డాక్టర్ అయ్యి అనుకున్నది సాధించింది ఆ యువతి. తన కలకు అడ్డుగా ఉన్న పేదరికాన్ని తన ఆత్మవిశ్వాసం , పట్టుదల , కృషితో అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
సంకల్పం దృఢంగా ఉండాలే కాని ఏ సమస్య వారిని కట్టడి చేయలేదు, కట్టి పడేయలేదు. విజయం తప్పక వారిని వరిస్తుంది. కష్టం అనుకుంటే ప్రతి చిన్న సమస్య పెద్దదిగానే కనిపిస్తుంది, సునామీలా భయపెడుతుంది. అదే మన లక్ష్యాన్ని గుర్తుచేసుకుంటూ  కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి అడుగు వేస్తే అదో చిన్న పిల్ల కాలువలా కనిపిస్తుంది. ఏదైనా మీ ఆలోచన విధానం, మీరు ఎంచుకున్న మార్గం పైనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: