విజయం మీదే: ఈ విషయాలు విజయసాధనలో చాలా ముఖ్యం?

VAMSI
ప్రస్తుతం ప్రపంచం అంతా గెలుపు వైపే పరుగులు తీస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో విజయం సాధించాలని ఆరాటపడుతారు. దాని కోసం ఎన్నో కలలు, ప్రణాళికలు, ఆటు పోట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ విజయం సాధించాలనే కసితోనే తమ ప్రయాణాన్ని ఆరంభిస్తారు. కానీ వచ్చే కష్టాన్ని జరగబోయే నష్టాన్ని ఎవ్వరూ ఊహించలేరు. కానీ మనకు ఉన్న కొద్ది లక్షణాలతో రాబోయే ఎలాంటి నష్టాలు కష్టాలు అయినా తట్టుకుని నిలబడి విజయాన్ని సాధించగలము. అయితే అవేమిటో ఒకసారి చూద్దాము.
* మనము విజయం కోసం పరుగులు తీసే ప్రయత్నంలో మనకు ఎన్నో సవాళ్లు ఎదురవ్వడం సహజమే.  అసలు సమస్యలు లేని జీవన పయనం లేదనే చెప్పాలి. జీవితంలో సుఖ దుఃఖాలు సహజమే.  
* అయితే మధ్యలో వచ్చే చిన్న చిన్న సంతోషానికి మరింత పొంగిపోయి రిలాక్స్ అయిపోవడం, దుఃఖం వచ్చిందని మధ్య లోనే వెను తిరిగి మన లక్ష్యానికి దూరం అవ్వడం రెండు పొరపాట్లే అవుతాయి.
* చిన్న చిన్న అనుకూల పరిస్థితుల వలన అనుకున్నవి సాధించగలమనే సంతోషం ఉండటంలో తప్పు లేదు. కానీ ఆ సంతోషంలో మన ఫోకస్ ని తగ్గించడం పొరపాటే. సాధించేంత వరకు విజయంపై నుండి మన దృష్టిని అస్సలు మరల్చకూడదు.
* సమస్య వచ్చినప్పుడు దానిని ఏ విధంగా ఎదుర్కొని బయటపడాలో అన్న దానిపై దృష్టి పెట్టాలి. అంతే కాకుండా సమస్యకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. విజయ మార్గం లో మీరు తీసుకునే ప్రతి ఒక్క స్టెప్ చాలా కీలకంగా మారొచ్చు.
* అలాగే కష్టాలు ఎదురైతే పిరికి వారిలా భయపడి ఆగిపోకూడదు. అందుకే ముందు నుండే  అవగాహన అనేది అవసరం. కష్టం వచ్చినపుడు ఏం చేయాలి..? సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి..?? అసలు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ప్రణాళిక ఉంటే విజయం మీ బానిస అవుతుంది.
*

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: