ఆర్థిక రంగంలో నోబెల్ వీరికే ?

Dabbeda Mohan Babu
ఈ సంవ‌త్స‌రానికి సంబంధించి వివిధ రంగాల్లో ఉన్న ప్ర‌తిభా వంతుల‌కు నోబెల్ బ‌హుమ‌తులను నోబెల్ క‌మిటి వారు ప్ర‌క‌టిస్తున్నారు. ఇప్ప‌టికే భౌతిక శాస్త్రం, ర‌సాయ‌న శాస్త్రం, వైద్య శాస్త్రం తోపాటు శాంతి రంగాల‌లో ఉత్త‌మ ప్ర‌తిభ చాటిన మేధావుల‌కు నోబెల్ పురష్క‌రాల‌ను ప్ర‌కటించారు. సోమ వారం రాత్రి కూడా మ‌రొక రంగంలో ఉత్త‌మ ప్ర‌తిభ చాటిన ముగ్గురు శాస్త్రవేత్త‌ల‌కు నోబెల్ బ‌హుమ‌తిని రాయల్ స్వీడిష్ అకాడ‌మీ వారు ప్ర‌క‌టించారు. ఆర్థిక రంగంలో ఈ ఏడాది లో ఉత్త‌మ ప్ర‌తిభ ను చాటిన ప్ర‌ముఖ ఆర్థిక వేత్త‌లు డేవిడ్ కార్ట్, జాషూవా యాంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్ ల‌కు ఈ ఏడాది నోబెల్ వ‌రించింది. ఈ విష‌యాన్ని సోమ‌వారం రాయ‌ల్ స్వీడిష్ అకాడమీ వారు నోబెల్ బహుమ‌తి యొక్క అధికారిక ట్వీట్ట‌ర్ అకౌంట్ లో పోస్టు చేశారు.


 డేవిడ్ కార్ట్, జాషూవా యాంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్  అనే ముగ్గురు ఆర్థిక వేత్త‌లు కూడా అమెరికా దేశానికి చెందిన వారే కావ‌డం విశేషం. వీరు నూత‌నం గా స‌హ‌జ ప్ర‌యోగాల‌ను క‌నుగొన్నాడు. అలాగే దీనిని అభివృద్ధి చేశారు. ఈ స‌హ‌జ ప్ర‌యోగాలు ఉప‌యోగించి ఎకాన‌మీ పాల‌సీల‌తో పాటు ఇత‌ర ఆర్థిక పాల‌సీల తో ఏర్పాడే ప్ర‌భావాల‌ను సుల‌భంగా అర్థం చేసుకోవ‌డానికి ఉప‌యోగిస్తారు. అయితే ఈ స‌హ‌జ ప్ర‌యోగాల కోసం డేవిడ్ కార్ట్, జాషూవా యాంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్  చేసిన కృషి కి ఫ‌లితంగా వీరికి ప్ర‌పంచ అత్యునత పుర‌ష్కారం నోబెల్ బ‌హుమ‌తి వ‌రించింది. అయితే డేవిడ్ కార్ట్ అనే ఆర్థిక వేత్త 1990 లో అమెరికాలో ని న్యూజెర్సీ రాష్ట్రంలో క‌నీస వేత‌నాల పెంపు అంశం వ‌చ్చిన‌ప్పుడు డేవిడ్ కార్ట్ ఈ స‌మ‌స్య ను ప‌రిష్క‌రించాడు. దీనికి కోసం డేవిడ్ కార్ట్ ప్ర‌త్యేకంగా ప్ర‌యోగాలు చేశారు. అందు కోసం గాను నోబెల్ బ‌హుమ‌తి తో పాటు వ‌చ్చిన న‌గ‌దు లో స‌గ భాగాన్ని డేవిడ్ కార్ట్ కు కేటాయించ నున్నారు. మిగిత స‌గ భాగాన్ని జాషూవా యాంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్ అనే ఆర్థిక వేత్త‌లు స‌మానం గా పంచు కుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: