విజయం మీదే: మీ బలహీనతనే బలంగా చేనుకోండి...

VAMSI
జీవితం అనేది సుఖదుఃఖాల సాగరం. ఇక్కడ అన్ని భావాలకు చోటుంది, కానీ ఏవీ శాశ్వతం కాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అన్నిటినీ ఎదుర్కుంటూ ముందుకు సాగాలి. అందరూ విజయాన్ని అందుకోవాలని పరుగులు తీసేవారే, ఎవ్వరూ కూడా ఓటమిని అంగీకరించలేరు, అంగీకరించడానికి సిద్దంగా ఉండరు. కానీ వాస్తవం ఏమిటంటే ప్రతి ఒక్కరికీ విజయం వెంటనే అందాలంటే కాస్త కష్టమే. వారి వారి సామర్థ్యాలను బట్టి, సంకల్పాన్ని బట్టి వారికి వారి లక్ష్యం చేరువవుతుంది. కొందరికి అన్నీ కలిసొచ్చి అతి తక్కువ సమయం లోనే విజయం సొంతం అయితే మరి కొందరికి వెంటనే అందదు. అయితే అంత మాత్రానికే మీరు ఓటమి ఎదురైందని నిరాశతో ఆగిపోతే మీ పయనం అక్కడే ఆగిపోతుంది.
ఇక మీ లక్ష్యం మీకు ఎన్నటికీ అందదు. వచ్చిన సమస్యను ఎదుర్కొని అధిగమించినపుడే విజయం మీ చెంతకు చేరుతుంది. వెళ్ళాలి అన్న స్థిర నిర్ణయం తీసుకున్నప్పుడే గెలుపు దారి కనపడుతుంది. చుట్టూ చీకటి ఉన్నా.... మీలో ఆ చీకటిని అధిగమించాలన్నా ఆకాంక్ష దృఢంగా ఉంటే చిమ్మ చీకటిలో కూడా చిరు దీపం కనపడుతుంది.
అందుకే ఎవరికైనా అనుకున్నది సాధించాలంటే కావాల్సింది ముఖ్యంగా ఎంచుకున్న లక్ష్యం  సరైనదై  ఉండాలి. అది మీ సామర్థ్యానికి తగినదై ఉండాలి.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆగిపోకుండా, ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగాలి. సమస్యలను చేదించి ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే విషయాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలి. గర్వాన్ని ఎప్పుడూ చూపించకూడదు. ఒక పేపర్ తీసుకుని అందులో ఒక వైపు మీ బలాలు మరో వైపు మీ బలహీనతలను రాసుకోండి. ఆ తర్వాత మీలో ఉన్న బలాల గురించి ఆలోచించక్కర్లేదు. మీలో ఉన్న ప్రతి కూలతలు మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మార్గాలను వెతకండి. అప్పుడే మీరు ఎంచుకున్న లక్ష్యానికి సరిపోయేలా మీ ప్రయత్నాలను సాగించగలరు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: