విజయం మీదే: బిజినెస్ లో సక్సెస్ కాలేకపోతున్నారా?

VAMSI
జీవితంలో ప్రతి ఒక్కరూ ధనవంతుడిగానే బ్రతకాలి అనుకుంటారు. దీని కోసం కొందరు ఉద్యోగం చేస్తారు మరి కొందరు వ్యాపారం చేస్తారు. ఉద్యోగ చేయడం వలన పెద్ద లాభాలు మీ రావు. కానీ సురక్షితంగా జీవించగలిగే స్వేచ్ఛ ఉంటుంది. అయితే వ్యాపారం చేసే వారికి ఎక్కువగా కష్టాలు టెన్షన్లు ఉంటాయి. వ్యాపారం బాగా సెట్ అయ్యే వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వ్యాపారంలో సాఫీగా సాగిపోవాలంటే ఏమి చిట్కాలు పాటించాలి ఒకసారి చూద్దాం. అయితే వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే కొన్ని స్కూల్స్ ఉండడం ఖచ్చితం. అయితే ఆ స్కిల్స్ ఎలాంటివో ఒకసారి చూద్దాం.
* బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. అందరూ చేస్తారు కానీ మీరు అభివృద్ధి చెందాలంటే కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉండాలి. వ్యాపారం కోసం ఎదుటి వారితో మాట్లాడే విధానం మరియు చక్కని రిలేషన్ షిప్ ను కొనసాగించడం ముఖ్యం. ఇలా ఉండడం అనేది మీకు బిజినెస్ లో ఎక్కువ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు ఇతరులతో సంభాషించేటప్పుడు కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. ఏదో సందేహంగా ఉన్నట్లు మాట్లాడకూడదు,. వారిలో నమ్మకం కలిగించేలా మాట్లాడాలి.
* మొదటి సారి బిజినెస్ చేసే సమయంలో కొన్ని తప్పులు చేయడం సహజం. అయితే వీటిని మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. చిన్న స్టెప్ అయినా సరే వెనుకా ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి చేయడం ప్రధానం. ఎటువంటి పరిస్థితుల్లోనూ అధైర్య పడకూడదు.  దైర్యంగా ముందుకు సాగిపోతే చిన్న చిన్న ఇబ్బందులు మీ బిజినెస్ ను ఇబ్బంది పెట్టలేవు.
* ఇక్కడ ఇంకొక విషయం కూడా చాలా ముఖ్యమని తెలుస్తోంది. ఎవ్వరైనా ఏదైనా విషయాన్ని మీకు చెబితే తప్పక వినాలి. అది మీకు ఉపయోగపడుతుంది అంటే ఆచరించండి. లేదా వదిలేయండి, అంతే కానీ ఎదురుగానే వారికి నచ్చలేదని చెప్పడం మీ బిజినెస్ కు ఇబ్బంది కలగవచ్చు. మీకు తెలియని విషయాలు వారికి తెలిసి ఉండొచ్చు కదా, ఆ విషయాలు మీ బిజినెస్ కి యూజ్ అవుతాయేమో అణా ఆలోచన తప్పక ఉండాలి.
* అన్నింటికన్నా ముఖ్యమైంది మీరు మిమ్మల్ని నమ్మి తీరాలి. బిజినెస్ లో కొన్ని సార్లు రిస్క్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మీరు దైర్యంగా స్టెప్ తీసుకోవాలంటే మీ మీద విశ్వాసం ఉండాలి.  
* ఈ బిజినెస్ విషయంలోనే కాదు మీ జీవితంలో ఎప్పటికీ ఉపయోగపడే ఒక మాట. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓవర్ కాన్ఫిడెన్స్ ను కలిగి ఉండకండి. ఇది మనిషిని ఎంతలా నాశనం చేస్తుందో చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పై విధంగా మీరు కనుక బిజినెస్ పెట్టాలి అనుకుంటే, అందులో రాణించడానికి ఇవి తప్పక కలిగి ఉండాలి. ఒకవేళ మీలో లేకపోయినా అలవర్చుకోండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: