విజయం మీదే: మీరు నిజంగా సంతృప్తిగా ఉన్నారా ?
రెండు సమయాల్లోనూ స్థిరంగా ఉండగలగాలి. సందర్భం ఏదైనా సమయస్ఫూర్తితో ఆలోచించగలిగితే అంతా అనుకూలంగానే అనిపిస్తుంది. గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు. ఓటమి పాలైన వాడు విచారంగా ఉంటాడు. అవి రెండూ జీవితంలో శాశ్వతం కాదని తెలిసిన వాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాడు. దీనర్థం ఏమిటంటే సుఖ దుఃఖాలు, జయాపజయాలు ఇవేవీ జీవితంలో చెప్పి రావు అలాగే స్థిరంగా ఉండిపోవు. ఈ విషయాన్ని నమ్మి , అర్దం చేసుకునేవాడు ప్రశాంతంగా జీవించగలడు. ప్రతి మనిషి తమ జీవితంలో జరిగే అశాశ్వతమైన అంశాల కోసం ప్రాకులాడకుండా పట్టుదలతో ముందుకు సాగండి.
ఉన్నంతలో సంతోషంగా ఉండగలిగితే అంతకు మించిన ధనధాన్యాలు లేవు. ప్రశాంతతకు మించిన ఆనందం మరొకటి లేదు. ఎవరైతే ఈ విషయాన్ని గ్రహించగలరో వారికి ప్రశాంతమైన జీవితం తప్పక లభిస్తుంది. ఇప్పటికి అయినా వాస్తవాన్ని గ్రహించండి. జీవితం యొక్క పరమార్ధం తెలుసుకోండి. అనవసరంగా అశాశ్వతమైన వాటి కోసం సమయాన్ని వృధా చేసుకోకండి. ఒకసారి ఆలోచించుకోండి మనము బ్రతుకుతున్న ఈ జీవితంలో సంతృప్తిగా ఉన్నామా అని, ఆ తర్వాత మీ ఇష్టం.