విజయం మీదే: మానవత్వమా... బ్రతికున్నావా ?

VAMSI
ప్రస్తుతం ఉన్నటువంటి ఫాస్ట్ జనరేషన్ లో మనుషులు ఎంతగానో మారిపోయారు. మన అమ్మమల నాటి కాలంలో మనుషుల జీవన విధానం, వారి పద్దతులు, అలవాట్లు వేరు ఇప్పుడు ఉన్నటువంటి, మనము అనుసరిస్తున్న పరిస్థితులు వేరే. అప్పట్లో ఎవరైనా కష్టం అంటే చాలు చుట్టుపక్కల వారంతా పరుగులు తీసి మన ముందు వాలేవారు. ఇపుడు కష్టం అని తలిస్తే మాకు అంత ఫ్రీ టైం లేదంటూ లెక్కలు వేసుకుంటున్నారు. అందరూ ఇలాగే ఉన్నారు అని చెప్పడం కరెక్ట్ కాదు కానీ, చాలా మంది ఇదే విధంగా ఎవరికి వారు అన్నట్టుగా జీవిస్తున్నారు. కొంత మంది వైఖరి చూస్తుంటే అసలు ఇంకా ఈ భూమిపై మానవత్వం ఉందా అంటూ బాధపడే పరిస్థితి. అయితే మనుషులంతా అలానే ఉన్నారా అంటే కాదనే చెప్పాలి.
ఒకటి రెండు లోపాలున్నాయని మొత్తం మానవత్వం మీదే నమ్మకాన్ని పోగుట్టుకోకూడడు. మానవత్వం మహా సముద్రం లాంటిది ఒడ్డున కాసిన్ని మురికి నీళ్ళు కలిసినంత మాత్రాన  మొత్తం సముద్రాన్నే మురికిగా మార్చలేవు. అదే విధంగా ఒకరిద్దరిలో మానవత్వం నశించింది కదా అని ప్రపంచమంతా అలాగే ఉందని నిరాశ చెంది మనము అందరి లాగే జీవిద్దాం. అందరికీ జరిగిందే మనకి జరుగుతుందని అనుకునే వాళ్లు లేకపోలేదు. కానీ ఇలాగే కొనసాగితే నిజంగా మానవత్వం అనే పదాన్ని డిక్షనరీలో వెతుక్కోవాల్సి వస్తుంది. మానవత్వం మళ్ళీ పూర్తిగా పరిమళించాలి అంటే అది ఎవరి చేతిలోనో లేదు.
మన చేతిలోనే ఉంది. తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ఒకరకంగా రేపటి సమాజాన్ని ప్రభావితం చేయగల ప్రముఖ వ్యక్తులు. తల్లితండ్రులు తమ పిల్లలకు, గురువులు తమ శిష్యులకు మానవత్వం యొక్క విలువలు, విశిష్టతను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ చిన్నప్పటి నుండే వారు అనుసరించేలా చేయాలి. ప్రయత్నం అనేది మొదలుపెడితే మనం కోరుకున్న మార్పు తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న వారిలో మీ మంచితనంతో మానవత్వంతో మనుషులుగా మార్చండి. నలుగురిని వారు మార్చేలా ప్రేరేపించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: