విజయం మీదే: మీరు విద్యార్థిగా ఇవి తెలుసుకోండి ?

VAMSI
చదువులో ఎప్పుడూ ముందుంటాడు, ర్యాంక్స్ కూడా బాగా వస్తాయి, కానీ ఒక్కసారిగా కాలేజీ నుండి చదువు ముగించుకుని బయటకి వచ్చిన ప్రతీ విద్యార్థికి ఒకటే లక్ష్యం. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, వారి ఆలోచనలు వేరుగా ఉండచ్చు, వారు ఎంచుకున్న మార్గాలు వేరుగా ఉండచ్చు, అదే విధంగా వారు కోరుకునే లక్ష్యము అందరికీ ఒకటి కాకపోవచ్చు. కానీ వారి సంకల్పం మాత్రం వారు కోరుకున్న లక్ష్యాన్ని సాధించి గుర్తింపు పొంది ఆర్థికంగా స్థిరపడటమే. ముఖ్యంగా నేటి జనరేషన్ లో ఆర్థికంగా స్థిరపడాలంటే కాలంతో పరుగులు తీయాలి. మెదడుకు పదును పెడుతూ ఎప్పటికప్పుడు చాలా చురుకుగా వ్యవహరిస్తూ ఉండాలి. కానీ ఇది అందరికీ అంత సులువు కాదు. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు ఇక ఉద్యోగం వచ్చేసినట్టే జీవితంలో సెటిల్ అయిపోయినట్టే అని.
అయితే ఇది పూర్తిగా నిజం కాదు. పరీక్షల్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. కానీ అది మనల్ని ఉద్యోగం కోసం పోటీ పడే ఒక ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్లే సాధనంగా ఉపయోగపడుతుంది. కానీ, ఆ ఉద్యోగం మనకు దక్కాలంటే మాత్రం ఎప్పుడో చదివి బట్టి పట్టిన పాఠాలతో అయితే పూర్తిగా కాదు. మెళకువలు ఏంరఃచుకోవాలి. విద్యానైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఇప్పటి సమాజానికి తగినట్లుగా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. మన మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. ఇదంతా మన ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. ఇలా సమయానికి తగ్గట్టు నడుచుకుంటేనే ముందుకు సాగగలం. అలా కాకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా, ఎప్పుడో తెచ్చుకున్న ఫస్ట్ క్లాస్ మార్కులు చూపించి నాకు మంచి పొజిషన్ ఇవ్వండి అంటే కాదు.
మీ ఆలోచనలు ఎప్పుడు కాలానికి అనుగుణంగా ఉండాలి. నాకు అంతా తెలుసు అని కూర్చోకుండా ప్రతి అనుభవాన్ని ఒక గుణపాఠంగా నేర్చుకుని వాటిని పాటించాలి. అపుడే అనుకున్నది సాధించగలం. ఈ సమాజంలో మనం కోరుకున్న స్థాయికి చేరుకుని పేరు ప్రఖ్యాతులు పొందగలం. విద్యాభ్యాసన సమయంలో పాఠాలను బట్టీ పట్టి యదావిధిగా అప్పచెప్పడం కాదు. విషయాలను అర్దం చేసుకుంటూ వాటి గురించి అవగాహన పొందడం నిజమైన అభ్యసనం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: