విజయం మీదే: ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకండి ?

VAMSI
మనిషి జీవితంలో ప్రతి నిమిషం చాలా విలువైనదే. అది గుర్తించి అందుకు తగ్గట్లుగా నడుచుకునే వాడే తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు. సమాజంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకొని మన్ననలను పొందుతాడు. అలా కాకుండా సమయాన్ని గాలికి వృధా చేస్తూ, కాలయాపన చేస్తూ పోతే అదే అలవాటు అయిపోతుంది. సమయం వృధా అయిపోతుంది జీవితం వ్యర్థం అయిపోతుంది. ఇటువంటి వారికి ఎటువంటి గుర్తింపు లభించకపోగా.. సమాజంలో కనీస మర్యాద దొరకడం కూడా కష్టమే అవుతుంది. ప్రతి నిమిషాన్ని కష్టంగా గడపమని ఎవరు చెప్పరు. కానీ ప్రతి నిమిషం కష్టపడి అయినా సరే మనకు ఉపయోగపడే విధంగా మలచుకోవాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం, ఆనందంగా జీవించగలం.
 విశ్రాంతి అవసరమే కావచ్చు. కానీ పరిమితికి మించిన విశ్రాంతి మనల్ని సోమరిపోతులుగా మారుస్తుంది. ఏ పనిమీద కూడా దృష్టి పెట్టనివ్వదు. ఇలా అయితే మనం ఏ లక్ష్యాన్ని ఛేదించడం కుదరదు. ఇక్కడ మీరు తెలుసుకోవలసింది ఒకటే సమయం ఎంత విలువైనదో గ్రహించి ప్రతి నిముషాన్ని ఉపయోగకరంగా వినియోగించుకోవడమే. గడిచిపోయిన క్షణం అయినా సరే తిరిగి పొందడానికి వీలే లేదు. జరిగిపోయిందని బాధపడే కంటే, సమయం మించి పోకముందే ఎప్పటి పనులు అప్పుడే చేసుకుంటూ పోవడం ఉత్తమం.
మనము నిత్యజీవితంలో ఎన్నో విషయాలను చూస్తూ ఉంటాము. రెప్ప పాటులో అంతా అయిపోయింది అని, అంతే కాకుండా ఎవరికైనా ఆక్సిడెంట్ జరిగితే ఒక గంట ముందు తీసుకువచ్చి ఉంటే వారిని కాపాడే వాళ్ళము అని డాక్టర్లు చెప్పే మాటలు చూసి ఉంటాము.  కాబట్టి సమయానికి ఎంత విలువుందో ఎవ్వరమూ వేల కట్టలేము. ఈ రోజు సమయాన్ని మనము గౌరవించి దానికి అనుగుణంగా నడుచుకుంటే రేపు భవిష్యత్తులో మనము సంతోషంగా జీవించగలము. ఈ విషయాన్ని గ్రహించి ఇప్పుడైనా సరైన స్టెప్స్ తీసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: