విజయం మీదే: క్షణికావేశాన్ని వదిలిపెట్టు... ?

VAMSI
ఈ లోకంలో అన్నింటి కన్నా ప్రమాద మైనది మానవుని కోపం మరియు ఆవేశం. కొన్ని సార్లు మన వినాశనాలకు మనమే కారణం అవుతుంటాము. అంటే మనము తీసుకునే నిర్ణయాలు అన్నీ సరిగా ఉండవు. ముఖ్యంగా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అసలు మంచిది కాదు. ఈ విషయాన్ని తెలుసుకున్న వారు జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారు. ఇదిలా ఉంటే నేటి సమాజంలో యువకులు క్షణికావేశాలకు గురయ్యి ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. కొన్ని సార్లు వారి ప్రాణాలను సైతం కోల్పోతుండడం అత్యంత బాధను కలిగించే అంశం. అనేక విషయాల్లో వారి వయసు ఈ క్షణికావేశానికి గురయ్యేలా ప్రభావితం చేస్తుంది. ఇందుకు చాలానే ఉదాహరణలు ఉన్నాయి.
యువకులు కొన్ని విషయంలో చాలా ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
స్నేహితులతో కలిసి తిరిగే సమయంలో, వారిలో వారికి తాహతు కు సంబంధించి బేధాలు రావొచ్చు. అటువంటి సమయంలో ఒక చిన్న మాట వారికి వ్యతిరేకంగా అన్నా కూడా క్షణికావేశానికి లోనవుతుంటారు. ఇక ఆ పరిస్థితుల్లో వారేమి చేస్తారో వారికే తెలియదు. నోటికొచ్చినట్లు తిట్టు కోవడం, కొట్టు కోవడం జరుగుతాయి. ఆవేశం ఇంకా ఎక్కువైతే హత్య చేయడానికి కూడా వెనుకాడరు. ఇలాంటివి చాలా సార్లు జరిగాయి. మనము ఎన్నోసార్లు పేపర్ లో చూసి ఉంటాము. ఉదాహరణకు మందు కోసం స్నేహితుల ఘర్షణ ఒకరు హత్య. ఇలా ఎన్నో సంఘటనలు జరిగి ఉంటాయి.
అంతే కాకుండా అమ్మాయిల విషయంలో కూడా క్షణికావేశానికి లోనయి స్నేహితులను హత్య చేయడం లేదా ప్రేమించిన అమ్మాయినే హత్య చేయడం లాంటివి కూడా జరుగుతున్నాయి. కానీ ఇవి అన్నీ కొంతవరకైనా జరగకుండా ఉండాలంటే పరిస్థితికి తగినట్లుగా ప్రవర్తించాలి. ఓపికగా ఉండాలి. ఒకరు ఆవేశంగా ఉంటే, పక్క వారు ఓపికగా మాట్లాడాలి, అప్పుడే గొడవ సద్దుమణుగుతుంది. ఈ ఆర్టికల్ చదివి కొద్ది మందైనా మారుతారని ఆశిస్తున్నాము.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: