ఈ కోటి.. ఏ కోటికి సరి..

Divya

కోటిరెడ్డి సరిపల్లి.. కృష్ణా జిల్లా, గుడివాడ దగ్గరలో జనార్ధనపురం గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1998 లో పదవ తరగతి పూర్తి చేసి, ఇక గుడివాడలోని PGDCA కోర్సు కూడా కంప్లీట్ చేశాడు. ఇక ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల కొద్దిరోజులు వ్యవసాయం పనులు కూడా చేసి, ఆ తరువాత PGDCA కోర్స్ ఆధారంగా గుడివాడలోనే డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేశారు. ఇక కంప్యూటర్ రంగంలో రాణించడం కోసం హైదరాబాద్ కి వచ్చి సీ లాంగ్వేజ్ లో కంప్యూటర్ ఫ్యాకల్టీగా కూడా పనిచేశాడు. ఇక 14 సంవత్సరాల వయసులోనే దేశంలో అతి చిన్న వయసులో జావా లో సర్టిఫికెట్ పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు.

ఇక తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం కోసం 12 రౌండ్ లను విజయవంతంగా పూర్తి చేసుకొని, ఆ సంస్థలో ఉద్యోగంలో చేరి కేవలం పది సంవత్సరాల లోనే చీఫ్ ఆఫ్ ఆర్కిటెక్ గా ప్రమోషన్ పొందారు. ఇక మైక్రోసాఫ్ట్ లో  ఉద్యోగం చేస్తున్న సమయంలోనే వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఆ తరువాత డాక్టరేట్ కూడా కంప్లీట్ చేశాడు. దాదాపు మైక్రోసాఫ్ట్ లో 10 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ను ఏర్పాటు చేసి, అందులో హెల్త్ టెక్, కోర్ టెక్ ఆర్ అండ్ డీ వంటి సంస్థల కోసం 238 దేశాలకు గాను మొత్తం 784 మంది ఉద్యోగులను చేర్చడం విశేషం.

ఇక ఆ తర్వాత భారత్ ఇన్నోవేషన్ పేరిట డిజిటల్ ఎడ్యుకేషన్, కోటి ఫౌండేషన్, డిజెడ్ పే, బోధా, సేవా ఫౌండేషన్, ఇండియా హెరాల్డ్, క్రౌడ్ బ్లడ్, సిట్రస్ క్లీనిక్, స్నాగ్గర్, మెడిటెక్, ఫిలాంత్రోపీ, అగ్రి టెక్, కన్స్ట్రక్షన్ అండ్ మాంటెక్ వంటి 14 టెక్ సంస్థలను ఏర్పాటు చేసి, అందులో వచ్చే రాబడి లో ప్రతి సంవత్సరం 33 శాతాన్ని నిరుపేదలకు, వితంతువులకు, వృద్ధులకు అందించడం గమనార్హం. అంటే ప్రతి సంవత్సరం తనకు ,తన సంస్థల నుండి వచ్చే ఆదాయంలో 33 శాతాన్ని అంటే దాదాపు 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో క్రౌడ్ బ్లడ్ సంస్థకు అందించడం మరో విశేషం.

అంతేకాదు చిన్నపిల్లల కోసం " పినాకిల్ బ్లూమ్స్" అనే సంస్థను కూడా ఏర్పాటు చేసి ,ఎంతోమంది ఆటిజం పేరిట బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నారు. ఇందులో రెండు నెలల వయసు కలిగిన చిన్నారుల నుండి 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి కావలసిన అన్ని చికిత్సలను ఉచితంగా అందించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇక ప్రస్తుతం ఈ సంస్థకు ఆయన భార్య శ్రీజ రెడ్డి సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ సంస్థ ద్వారా ఇతర దేశాల నుంచి కూడా ప్రజలు అలాగే పిల్లలు సేవలను అందుకోవడం గమనార్హం.

ఇక అంతే కాదు తన సొంత ఊరిలోనే జనార్ధనపురం దగ్గర్లో వున్న జిల్లా పరిషత్ హై స్కూల్, మండల పరిషత్ హై స్కూల్ లను దత్తత తీసుకొని, సుమారు 700 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడంతో పాటు, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం విశేషం. స్కాలర్షిప్ పేరిట ప్రతి సంవత్సరం ఎంతో మంది పిల్లలకు ఉన్నత చదువులను ఉచితంగా అందిస్తున్నారు. ఇక ప్రస్తుత సమాజంలో తన సంపాదనలో ఇంత మొత్తాన్ని పేదలకు అందిస్తూ, తన సంస్థ ద్వారా 162 దేశాల్లోని ప్రజలు కూడా లాభం పొందుతూ ఉన్నారు. ఇక ఇంతటి మాహాకార్యం కేవలం reddy SARIPALLI' target='_blank' title='కోటి రెడ్డి సారిపల్లి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోటి రెడ్డి సారిపల్లి కి మాత్రమే సాధ్యం. ఇక ఈయన సేవలకు ప్రపంచంలో ఎవరు సాటిరారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: