విజయం మీదే: లైఫ్ లో కమిట్మెంట్ చాలా కీలకం ...
కానీ ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే మనం ఎంచుకున్న మార్గంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వవచ్చు. వాస్తవానికి జీవితమంటేనే ఒక పద్మవ్యూహం...ఎదురైన ఇబ్బందులను, కలిగే కష్టాలకు బయపడి ఆగినా లేదా మనకు ఇది చాలులే అని అక్కడితో నీ పయనాన్ని విరమించుకున్నా నీ గోల్ అంతటితో అంతం అయిపోతుంది. అందుకే అలాటి సమస్యలు ఎదురైనప్పుడల్లా ఆ భాదల కన్నా నీ లక్ష్యం విలువైనదని అర్థం చేసుకుని ముందుకు సాగితేనే మరియు మీరు మీ గమ్యాన్ని చేరాలన్న మీ సంకల్పానికి కట్టుబడితేనే ఇలాంటి కష్టాలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. లక్ష్యం అనేది కళ్ళ ముందు కనిపిస్తూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశా నిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి సహకరిస్తుంది.
మన ఆలోచనలు మన లక్ష్యాన్ని మాపనం చేస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా అన్నింటినీ అధిగమించి పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని అందుకోవాలన్న దృఢమైన సంకల్పాన్ని మీ కమిట్మెంట్ తో ఆచరణాత్మక పద్దతులలో పెడితే మీ గోల్ ని సాధించడం అంత కష్టమేమీ కాదు. అలాగే చాలా మంది జీవితంలో ఏదో సాధించాలనుకుంటారు కానీ కొంచెం బెటర్ లైఫ్ దొరకగానే మనకు ఈ మాత్రం చాలులే అని సర్దుకుపోతారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు . నిజానికి మీకు చెందాల్సిన ఆ గొప్ప విజయాన్ని మీరే చేతులారా చేజార్చుకున్నట్టు అవుతుంది. అందుకే జీవితంలో కమిట్మెంట్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.