విజయం మీదే: ఏ పనైనా ఆటంకం లేకుండా పూర్తి చెయ్యాలి...!

VAMSI
మానవునిగా మనము ఎన్నో లక్ష్యాల వైపు పరుగెడుతూ ఉంటాము. కానీ ఇక్కడ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మీ లక్ష్యాన్ని మీకు దూరం చేస్తాయి. ఎలా అంటే కనీసం చిన్న పొరపాటు కూడా చెయ్యకుండా మీరు లక్ష్యం వైపు సాగాలి. ఉదాహరణకు ఒక చిన్న రంధ్రం ఒక పెద్ద పడవను ముంచేయగలదు. అలానే జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మనకు పెద్ద నష్టాన్ని చేకూరుస్తాయి. ఒక అలవాటు మిమ్మల్ని అపజయం పొందేలా చేస్తుంది. ఆ అలవాటును తప్పకుండా మానుకోండి లేకపోతే భారీ నష్టాన్ని ఈ నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. అనగా అనగా రాగ మతిశయిల్లుచునుండు. తినగ తినగ వేము తియ్యనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఎన్నో వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు గొప్ప కవులైన ఎందరో మహానుభావులు ఎప్పటినుండో మనల్ని మోటివేట్ చేస్తూనే ఉన్నారు.
వారి రచనల ద్వారా కాని వాటిని మనం పట్టించుకోకుండా ఉండడం చాలా దురదృష్టకరం. పాడగా పాడగా చక్కటి గాయకుడిగా తయారవ్వచ్చు. తినగా తినగా చేదైన వేపాకు కూడా తియ్యగా తయారవుతుంది. చేయగా చేయగా అంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ పనైనా సరే విజయవంతం అవుతుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోతుంటారు . ఇప్పుడు ఇదే మన జీవితంలో అపజయానికి పెద్ద కారణం .  మీరు ఖచ్చితంగా జీవితంలో విజయం పొందాలంటే ఏ పనినైనా నిరాటంకంగా కొనసాగించాలి.
మీరు ఒక విద్యార్థి అయితే మీరు నిరాటంకంగా చదివినట్లయితే మీరు మంచి మార్కులతో పాస్ అవడం జరుగుతుంది. మరియు మీయొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా చాలా మెరుగు పడుతుంది. బయటి ప్రపంచంలో ఎలాంటి పోటీ నైనా మీరు తట్టుకోగలరు నిరాటంకంగా చదివినప్పుడు. కాలేజీ పని దినాలలో మీరు సరిగా హాజరు కాకుండా ఉండడం వలన అది నీకే పెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే నీ యొక్క పని ఫలితం నువ్వు మాత్రమే అనుభవించాల్సి వస్తుంది. ప్రతి రోజు కాలేజీకి హాజరై ప్రతి క్లాసులు శ్రద్ధగా వింటూ చదువుతూ ఉండు ఈ ప్రక్రియను నువ్వు నిరాటంకంగా కొనసాగించినట్లు అయితే విజయం పొందడం లో నిన్ను ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. కాబట్టి మొదలు పెట్టిన ఏ పనిని అయినా సరే ఆటంకం లేకుండా పూర్తి చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: