విజయానికి కావలసిన లక్షణాలు...

VAMSI
ముందుగా మీరు విజయం సాధించాలంటే బర్నింగ్ డిజైర్ (ప్రజ్వలించే కోరిక) ఉండాలి. ప్రయత్నంచేసి విఫలమయ్యేవారు, అసలు ఏప్రయత్నం చెయ్యకుండానే విజయం సాధించేవారికంటే మెరుగైనవారే.
మీరు ఏదైనా పనిచేసే ముందు - నేనీ పని చేస్తే మా అమ్మ, నా స్నేహితులు  " భలేచేసావు " అని మెచ్చుకుంటారా లేక " ఇలా చేసావేమిటి " అని సిగ్గుతో తలదించుకుంటారా ? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడా పని చెయ్యాలో వద్దో మీకే తెలుస్తుంది. మీరు ఇంట్లోగానీ, ఆఫీసులోగానీ, ఒంటరిగాగానీ, ఇతరులతో కలిసిగానీ - ఏదైనా ఒక పనిచేస్తున్నప్పుడు నేను చేస్తున్న పని నా పిల్లలు చూస్తే, వాళ్ళు దానిని చూడడం నేను ఇష్టపడతానా ? లేక సిగ్గుపడతానా ? " అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడా పనిచేయాలో వద్దో మీకే తెలుస్తుంది.పిరికివాళ్ళు మృత్యువుకు ముందే పలుమార్లు మరణిస్తారు. ధైర్యవంతులు చావును ఒకేసారి రుచిచూస్తారు.
క్యాంపస్ ఇంటర్వ్యూ అంటే టెన్షనే. నేడు మళ్ళీ తిరిగి రాదు దానిని పూర్తిగా ఉపయోగించుకుంటాను. నేను ఇంకొకరిని ఎప్పుడూ కాను. నన్ను నేను పూర్తిగా ఉపయోగించుకుంటాను. గెలిచినవాడు గెలవక ముందే గెలవాలని అనుకున్నవాడే ! గెలిచేవాడు ముందే గెలిచిన చిత్రాన్ని మనసులో ముద్రించుకున్నవాడే. బాస్ ఎప్పుడూ తనమూడ్‌తో నిమిత్తం లేకుండా వచ్చిన వారు చెప్పింది వినాలి. వచ్చిన వారు చెప్పింది విని కంపెనీకి ఏది లాభదాయకమో యోచించి నిర్ణయించాలి. పోటీ పరీక్షలకు ఆసక్తితో, అభిమానంతో చదవాలి. దానిని ఒక జీవన్మరణ సమస్యగా తీసుకోకూడదు. నీ ఆశయసాధనలో వెయ్యిసార్లు విఫలమైనా ఫరవాలేదు. మరొకసారి ప్రయత్నించు.  
ఎవరైనా ప్రథమస్థానంలో ఉండాలని కోరుకోవడాం సహజం, కానీ అందుకొరకు తపిస్తూ అనుక్షణం కృషిచేయడం కూడా చాలా ముఖ్యమని గ్రహించండి. నిజాన్ని ప్రేమిస్తూ నిజమే మాట్లాడడం, గొప్పలు చెప్పకపోవడం, అందరితో మంచిగా మసలడం, మంచి మాటతీరు అలవరచుకోవడం, విశ్లేషాత్మకంగా ఆలోచించడం అలవరచుకోవాలి. ఇవన్నీ కూడా విజయం సాధించడానికి ఉపయోగపడే మంచి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: