ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. అయితే మీరే విజేతలు... !
1.విజేతలు అదృష్టాన్ని కాదు శ్రమను నమ్ముకుంటారు.
మన దగ్గర ఎన్ని ఉపాయాలు ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా కూడా శ్రమను లేకుంటే ఫలితం సూణ్యం. అది తెలిసిన వారే విజేతలుగా నిలబడతారు. అందుకే మీరు కూడా శ్రమనే నమ్ముకోండి. అదృష్టం అనేది శ్రమకు వచ్చే బోనస్ లాంటిది. శ్రమ లేని వారిని అదృష్టం వరించదు.
2.ప్రపంచం నిద్రిస్తున్న వేళ వీరు పని చేస్తూ ఉంటారు:
విజేత రాత్రి ఉదయించే సూర్యుడు లాంటివాడు. రోజంతా కష్టపడి రాత్రికి విశ్రాంతి తీసుకునేవారు సాధారణ వ్యక్తులు. రాంత్రిమ్బవళ్లూ అనుకున్న లక్ష్యం మీదే సాధన చేసే వారు విజేతలు గా నిలుస్తారు. అలాగని నిద్ర మానేసి శ్రమించడం కాదు. విజేతలు నిద్రలో కూడా గెలుపు గురించే కలలు కంటారు.
3.మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి:
విజేత కు ఉండవలసిన లక్షణాలలో ఇది చాలా ముఖ్యమైనది. ఏదైనా సాధించాలని ప్రయత్నించినపుడు ఓటమిపాలైతే తప్పు వాళ్ళమీద వీళ్ళ మీద వీళ్ళమీద చూపించకుండా మన ప్రయత్నం లోపం ఉందని గ్రహిస్తారు. మరలా రెండోసారి ప్రయత్నం చేసినపుడు ఆ తప్పులు జరగకుండా సరిదిద్దుకుంటారు.
4. సహచరులకు సాయం చేస్తారు :
గెలుపు అంటే మనం గెలవడం మనతో పాటు మంచుట్టూ ఉన్నవాళ్ళని గెలిపించడం.అలాంటి గెలుపు అలాంటి గెలుపు శాశ్వతంగా ఉంటుంది. విజేతలు వారితో పాటు వారి చుట్టూ ఉన్నవాళ్లని కూడా గెలిపిస్తారు.
5.సృజనాత్మకత, సమయస్ఫూర్తి తో పని చెస్తారు :
మనం చేసే పనిలో నాణ్యత, సమయస్ఫూర్తి ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే ఫలితాన్ని ఎవరూ ఆపలేరు. గెలవాలనే లక్ష్యం ఉన్నప్పుడు చేసే పనిలో శ్రద్దఉంటే మంచి ఫలితం వస్తుంది.
6. విజేతలు ఎప్పుడూ సాహస వంతులు గా ఉంటారు:
ఏ గొప్ప లక్ష్యాన్ని సాధించాలన్న మన జీవితమలో కొంత రిస్క్ తీసుకోవాలనే విషయం వారికీ తెలుసు. అందుకే అంటారు రిస్క్ లేకపోతే రస్క్ ఉండదు అని... అందుకే ఎలాంటి అవకాశాలు వారి ముందుకి వచ్చిన కూడా, వాటిని పూర్తిగా అర్ధం చేసుకొని, అవసరమైన మేరకు రిస్క్ కూడా తీసుకొని విజేతగా నిలుస్తారు. ఇలా వారు ఎంచుకున్న రంగంలో విజేతగా పేరు తెచ్చుకుంటారు.
ఈ ఆరు లక్షణాలూ మీలో కూడా ఉంటే మీరే విజేతలు... ఆల్ ది బెస్ట్...