విజయం మీదే : సామర్థ్యాన్ని పెంచుకుంటే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సక్సెస్ సాధించడానికి సామర్థ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరం. మనం విజయం సాధించాలని కోరుకున్నంత మాత్రాన విజయం సొంతం కాదు. మనలో ప్రతి ఒక్కరూ సక్సెస్ సాధించాలనే ఆకాంక్షిస్తారు. అయితే ఆ సక్సెస్ సాధించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుకుంటే మాత్రమే విజయం సొంతమవుతుంది. మనం సామర్థ్యాలను పెంచుకునే కొద్దీ విజయావకాశాలు అదే స్థాయిలో పెరుగుతుంటాయి.
 
సామర్థ్యాలను పెంచుకోకుండా సక్సెస్ కోసం ప్రయత్నిస్తే నిరాశాజనకమైన ఫలితాలే ఎదురవుతాయి. అవగాహనా శక్తిని పెంచుకోవడం ద్వారా మాత్రమే మనం విజయం సాధించగలుగుతాం. అలా కాకుండా ఏదో కష్టపడ్డాం అనే విధంగా లక్ష్యం కోసం శ్రమిస్తే మంచి ఫలితాలు సొంతం కావు. ఊరికే కష్టపడితే విజయం సొంతం కాదు. సరైన పనిని సరైన సమయంలో సరైన చోట చేస్తే మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి.
 
ఈ విధంగా అనుకున్న ప్రతి పనిలో విజయం సాధించాలంటే తెలివితేటలు, దృక్పథం అవసరం. సామర్థ్యంతో పాటు అవగాహనా శక్తిని పెంచుకుంటే విజయావకాశాలు మరింత పెరుగుతాయి. మన జీవితంలో ఎలా ఉందో అలా చూడగలిగి తెలివితేటలతో సక్సెస్ కోసం ప్రయత్నించాలి. చాలామంది తమ జీవితం ఎలా ఉందో అలా చూడలేకపోతూ ఉండటం వల్లే విజయం సాధించలేకపోతున్నారు.
 
జీవితాన్ని అది ఉన్న విధంగా చూడలేకపోతే మన తెలివితేటలే మనకు విరుద్ధంగా పని చేస్తాయి. మనం విజయం సాధించడానికి చేయాల్సిన పనులన్నీ చేస్తే విజయం తప్పక సొంతమవుతుంది. సరైన ప్రణాళికను నిర్దేశించుకొని సక్సెస్ సాధించడం కోసం వచ్చిన అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటూ ప్రయత్నం చేస్తే సులువుగా విజయం సాధించడం సాధ్యమే. విజయం సాధించడానికి మన బలాలు ఏంటో బలహీనతలు ఏంటో తెలియాలి. మన బలాలను అంతకంతకూ పెంచుకుంటూ బలహీనతలను తగ్గించుకుంటూ సక్సెస్ కోసం ప్రయత్నిస్తే విజయం తప్పక సొంతమవుతుంది. ఈరోజుకు రేపటికి కొంచెం కొంచెం మెరుగవుతూ లక్ష్యం కోసం శ్రమిస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలను అందుకునే అవకాశం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: