విజయం మీదే : ఫలితం గురించి ఆలోచించకుండా ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే విజయం మీ సొంతం

Reddy P Rajasekhar
మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో స్థిరపడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అనుకుంటారు. కానీ చివరకు ఏదో ఒక ఉద్యోగం లేదా వ్యాపారంలో మునిగిపోయి రాజీ పడి జీవితం గడుపుతారు. చాలామంది లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి భయంతోనో మరే ఇతర కారణాల వల్లో విజయానికి ఆమడదూరంలో ఆగిపోతూ ఉంటారు. లక్ష్య సాధన దిశగా మనం ప్రయాణిస్తే కచ్చితంగా విజయం సొంతమవుతుంది.
 
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా మనం ఉంటే ఎప్పటికీ మనం ఉన్నత శిఖరాలను అధిరోహించలేం. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలనుకుంటే మనతో మనం పోటీ పడాలి. సక్సెస్ సాధించాలంటే మొదట మానసికంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అనంతరం కార్యరంగంలో దూసుకుపోవడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా చేస్తే సక్సెస్ తప్పక సొంతమవుతుంది.
 
కాలంతోపాటే లక్ష్యాలు మారే అవకాశం ఉంటుంది. లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని పటిష్ట ప్రణాళికను రూపొందించుకుని శ్రమిస్తే సమర్థ ఆచరణే మనల్ని గమ్యస్థానాలకు చేరుస్తుంది. అసమర్థత వల్ల మనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోను నిందించుకోకూడదు. మానసిక శక్తిని పెంచుకుని విజయానికి మార్గం వేసుకోవాలి. అవసరమైన సామర్థ్యాల అభివృద్ధికి కృషి చేస్తే సక్సెస్ తప్పక సొంతమవుతుంది.
 
లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా నూటికి నూరు శాతం శ్రమిస్తున్నామా...? లేదా...? అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఫలితం గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. సరైన రీతిలో కష్టపడితే సులభంగా విజయం సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. సక్సెస్ సాధించాలంటే మన తప్పులను మనం ఒప్పుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా శ్రమిస్తే ఏ పనిలోనైనా విజయం సాధించడం సాధ్యమే. ఫలితం గురించి ఆలోచించకుండా పనిని ప్రారంభిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఫలితం గురించి ఆలోచిస్తే కొన్ని సందర్భాల్లో భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. సరైన లక్ష్యాన్ని ఎంచుకుని ప్రణాళికాబద్ధంగా సక్సెస్ వైపు అడుగులు వేస్తే జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించి ఉన్నత స్థానాలకు చేరుతాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: