విజయం మీదే : ఈ రహస్యాలను ఎవరితో పంచుకోకపోతే జీవితంలో సక్సెస్ మీ సొంతం
మనం జీవితంలో సాధించాల్సిన లక్ష్యాల గురించి ఎవరితో చర్చించకూడదు. మన లక్ష్యాల గురించి ఇతరులతో చర్చిస్తే అవతలి వ్యక్తుల మాటలు మనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల మనం లక్ష్యాలను సాధించిన తరువాత వాటిని రివీల్ చేయడం ఉత్తమం. మన ఆదాయం గురించి ఇతరులతో ఎట్టు పరిస్థితుల్లోనూ చర్చించకూడదు. ఇది ఇతరులకు అనవసరమైన విషయం అని గుర్తించాలి.
ఇల్లు, కారు, అపార్టుమెంట్, బ్యాంక్ బ్యాలెన్స్, జ్యువెలరీ, బైక్, భూమి వంటి రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదు. ఇతరులకు ఆస్తుల వివరాలను చెప్పడం ద్వారా సమాజంలో మనకు గౌరవం లభిస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. అందువల్ల కుటుంబ సభ్యులతో తప్ప ఎవ్వరితో ఆస్తుల వివరాలను పంచుకోకూడదు. మన వ్యక్తిగత విషయాలను అవతలి వ్యక్తులతో పంచుకుంటే మనకు నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం చేకూరదు. కొన్ని సందర్భాల్లో మనం చెప్పిన రహస్యాలే మనకు కొత్త సమస్యలు సృష్టిస్తాయి.
మనం ఎవరినైతే బాగా నమ్ముతామో వాళ్లతో మాత్రమే వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో మనం ఇతరుల జీవితాల గురించి కామెంట్స్ చేస్తూ గాసిప్స్ మాట్లాడుతూ ఉంటాం. మనం ధైర్యవంతులమైనప్పటికీ ఎక్కడైనా ఆచితూచి మాట్లాడాలి. ఇష్టానుసారం మాట్లాడితే మన మాటలు ఇతరులపై ప్రభావం చూపవచ్చు. మనం చేసే మంచి పనులు, దానధర్మాల గురించి ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో చర్చించకూడదు. పైన పేర్కొన్న రహస్యాలను ఎవరితో పంచుకోకపోవడం వల్ల జీవితంలో సులభంగా విజేతలుగా నిలిచే అవకాశం ఉంటుంది.