విజయం మీదే : కింద పడ్డానని ఆగిపోకు.... తిరిగి ప్రయత్నిస్తే విజయం నీ సొంతం

Reddy P Rajasekhar

మారుతున్న పోటీ ప్రపంచంలో సక్సెస్ కు రోజురోజుకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఎవరైతే సక్సెస్ సాధిస్తారో వారికి సమాజంలో గౌరవం, గుర్తింపు దక్కుతోంది. సక్సెస్ సాధించని వారిని సమాజం చిన్నచూపు చూస్తోంది. జనాభా పెరుగుతున్నా ఉద్యోగ అవకాశాలు పెద్దగా పెరగడం లేదు. అందువల్ల పోటీ ప్రపంచంలో పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఎంతో శ్రమిస్తే మాత్రమే విజయం సాధించడం సాధ్యమవుతోంది. 
 
చాలామంది కెరీర్ లో విజయం సాధించలేకపోవడానికి అసలు కారణం తొలి ప్రయత్నంలో ఓటమి పాలు కావడం. ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆశించి ఓటమి పాలు కావడంతో చాలామంది నిరాశానిస్పృహలకు లోనవుతున్నారు. తమ జీవితం ఇంతేనని... తమకు అదృష్టం లేదని... ఇతరుల్లా తాము విజయాలను అందుకోలేమనే ఆలోచనలతో చాలామంది సమయాన్ని వృథా చేస్తూ ఉంటారు. 
 
ఒకసారి ఓడిపోయానని ఆగిపోతే జీవితంలో ఆ వ్యక్తికి ఎప్పటికీ సక్సెస్ సొంతం కాదు. తొలి ప్రయత్నంలో విజయం దూరమైనా మలి ప్రయత్నాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనపై మనకే నమ్మకం లేకపోతే విజయం సాధించే అవకాశం ఉన్నా అపజయమే సొంతమవుతుంది. మనపై మనకు నమ్మకం, విశ్వాసం ఉంటే మాత్రమే సులభంగా సక్సెస్ సాధించగలుగుతాం. 
 
లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యం కోసం శ్రమిస్తే విజయం సాధించడం కష్టమేమీ కాదు. ప్రణాళికాబద్ధంగా లక్ష్యం కోసం శ్రమిస్తే విజయం సులభంగా సొంతమవుతుంది. కింద పడ్డానని ఆగిపోకుండా లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో చేసిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఓటమిని అంగీకరించడం మొదలుపెడితే విజయం తప్పక సొంతమవుతుంది.  ఏ విషయంలోనైనాఓటమి పాలైతే అందుకు గల కారణాలను విశ్లేషించుకోవాలి. ఆ పొరపాట్లను, తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి.                            

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: