విజయం మీదే : ఓటమిలోను గెలుపును వెతుక్కుంటే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

ప్రతి మనిషి సక్సెస్ కోసమే పని చేస్తాడు. కొందరికి సులభంగా సక్సెస్ సొంతమైతే మరికొందరికి ఎంత కష్టపడినా సక్సెస్ రాదు. అలా ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయిన వారు తాము జీవితంలో సక్సెస్ సాధించలేమని... తమ జీవితం ఇంతే అని అనుకుంటూ నిరాశానిస్పృహలకు లోనవుతూ ఉంటారు. మరికొందరు ఒకటి రెండు మార్కులు తక్కువ రావడంతో జాబ్ మిస్ అయిందని... ప్రతిసారి జాబ్ విషయంలో సక్సెస్ కాలేకపోతున్నామని చెబుతూ ఉంటారు. 
 
జీవితంలో కష్టపడే ప్రతి ఒక్కరికీ సక్సెస్ వస్తుంది. కొందరికి సక్సెస్ త్వరగా వస్తే మరికొందరికి ఆలస్యంగా వస్తుంది. జీవితంలో ఓటమిపాలైన ప్రతిసారి ఆ ఫెయిల్యూర్ ను సక్సెస్ కు పునాదిలా మలచుకోవాలి. మనపై మనం నమ్మకాన్ని కోల్పోకుండా మరలా ప్రయత్నించాలి. ఓటమి పొందటానికి గల కారణాలను తెలుసుకుని సక్సెస్ కోసం కృషి చేయాలి. ఆ పొరపాట్లు మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. 
 
జీవితంలో సక్సెస్ ను అందుకున్న వారంతా ఎన్నో ఓటముల తరువాతే విజయాన్ని సొంతం చేసుకున్నారు. థామస్ అల్వా ఎడిసిన్ విద్యుత్ బల్బును కనిపెట్టడానికి వెయ్యిసార్లు ప్రయత్నించి విఫలమై ఆ తరువాత సక్సెస్ ఆయ్యాడు. ఎడిసన్ తాను వెయ్యిసార్లు బల్బును ఎలా కనిపెట్టకూడదో చేసిన ప్రయత్నాల్లో తెలుసుకున్నానని చెప్పారు. అదే విధంగా జీవితంలో మన ఓటములే గెలుపుకు మార్గాన్ని చూపిస్తాయి. 
 
ఫెయిల్యూర్స్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే. ఆ ఫెయిల్యూర్ ను సక్సెస్ కు దారిలా మార్చుకునే వారు కొందరైతే ఆ ఫెయిల్యూర్స్ వల్ల మరికొందరు కెరీర్ ను నాశనం చేసుకుంటూ ఉంటారు. లక్ష్యాన్ని ఎంచుకుని... ఆ లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ గెలుపు కోసం కష్టపడితే సక్సెస్ సాధించడం అసాధ్యమేమీ కాదు. మనల్ని మనం ఇతరులతో పోల్చుకోకుండా లక్ష్యం కోసం కష్టపడితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుని అద్భుతమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: