అమ్మ: ముప్పై ఐదేళ్ల తర్వాత పిల్లలు పుడతారా..??

N.ANJI
అమ్మ అనే పిలుపు కోసం ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం అమ్మాయిలు లెట్ గా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ముప్పై ఐదు సంవత్సరాలు తరువాత గర్భం దాల్చడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూద్దామా. సాధారణంగా 37 సంవత్సరాల కంటే ముందుగానే ప్రెగ్నెన్సీ కావడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే 37 సంవత్సరాల వయసు దాటితే ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం తగ్గిపోతుందని తెలిపారు. ఇక అనేక పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితాల ప్రకారం 37 సంవత్సరాల ముందు దాదాపు 78 శాతం అవకాశం ఉంటుందని నిపుణులు తేల్చి చెప్పారు.
ఇక కొంత మంది స్త్రీలు ఈ వయసులో ప్రెగ్నెన్సీ కావడం లేదని అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కాగా.. ఈ వయసులో కూడా వారికి అండాశయంలో అనేక అండాలు ఉంటాయని తెలిపారు. అంతేకాక.. వాటి క్వాలిటీ వల్లే అసలు సమస్య ఉత్పన్నం అవుతుందని అన్నారు. అంతేకాక ఈ వయసులో గర్భం దాల్చితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి ఈ వయసులో IVF పద్ధతిలో గర్భం దాల్చడం ఉత్తమం అని చెబుతున్నారు. అంతేకాక.. IVF కోసం గైనకాలజిస్టును సంప్రదించాలని అన్నారు. అయితే 40–50 సంవత్సరాల వయసులో మీరు గర్భం దాల్చాలని ప్రయత్నిస్తే IVF అనేది ఉత్తమ మార్గం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా.. అండాలను ఫ్రీజ్ చేసి ఫలదీకరించడం వలన ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
అయితే 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత అండాలు విడుదలవుతున్నప్పటికీ అందులో ఉండే క్వాలిటీ తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అంతేకాక.. అండాలు ఉత్పత్తి అయ్యే సంఖ్య కూడా క్రమంగా తగ్గుతాయి. ఇక ఒక వేళ అదృష్టవశాత్తు ప్రెగ్నెన్సీ దాల్చినప్పటికీ గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈ వయస్సులో దాదాపు 90 శాతం అండాలు ఆరోగ్యకరంగా ఉండవు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: