అంత పెద్ద మోసం చేసిన ఆ భార్యే కావాలంటున్న భర్త..

Mamatha Reddy
అందరిలాగే తాను కూడా o అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక జీవితం ఎంతో ఆనందమయం,గా సుఖవంతంగా సాగిపోతుంది అని అనుకున్నాడు ఓ యువకుడు. భార్య కూడా తనకు అన్ని రకాల సేవలు చేస్తుండడంతో పిచ్చిగా ఆమెను ప్రేమించాడు. ఇక తన జీవితం సార్ధకమైనట్లే అని భావించాడు. కానీ ఆమెకు ఒక వైపు మాత్రమే చూసిన ఆ యువకుడు మరొక వైపు ఉన్న అసలు రూపాన్ని గమనించలేకపోయారు. ఓ వైపు ఎంతో గాఢంగా భర్తను ప్రేమిస్తున్నట్లు నటిస్తూనే ఆ యువకుడి ని ఎంతో మోసం చేసింది. ఆమె ప్రేమకు యువకులు తమ కుటుంబాలను సైతం వదిలేసి వచ్చే అంత అందం ఆమె సొంతం.

ఆకర్షణీయంగా కనిపించి యువకులను బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకుని ఆ తర్వాత వారి నుంచి అంతా దోచుకుని మాయమవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఆ విధంగానే ఓ యువకుడు ఆ యువతి ప్రేమించే విధానాన్ని చూసి నిజమనుకుని ప్రేమ అనుకొని పెళ్లి చేసుకొని దారుణంగా మోసపోయాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అమిత్ శర్మ రుచి వర్మ అనే ఓ యువకుడి ని ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారంతో ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. 

మొదటి లాక్డౌన్ టైం లో జరిగిన పెళ్లి కావడంతో ఆ పెళ్ళికి ఎవరిని పిలవలేకపోయారు.  చాలా తక్కువ మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఆ తరువాత కొన్ని రోజులు వీరిద్దరి కాపురం ఎంతో సాఫీగా సాగింది. ఈ క్రమంలో రుచి తన బంధువుల ఇంటికి అని చెప్పి వెళ్ళింది. వెళ్లేముందు తనతో పాటు 50 వేల రూపాయల నగదు, విలువైన ఆభరణాలు తీసుకెళ్ళింది. పెళ్లి కోసం వెళ్లిన భార్య ఇంకా తిరిగి రాకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ అత్తారింటికి వెళ్లాడు అమిత్. కానీ అక్కడ మరో పెళ్లికి సిద్దమవుతున్న రుచి నీ చూసి షాక్ అయ్యాడు. అక్కడ ఇరుగు పొరుగు వారు ఆమె గురించి చెప్పింది విని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెనే తనకు భార్యగా కావాలని పట్టుపట్టాడు. మరి పోలీసులు అమిత్ కు తగిన న్యాయం చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: