అమ్మ: గర్భిణులు ఇవే తింటే చాలా మంచిది..!

N.ANJI
బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంది.తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డతో ముద్దుగా అమ్మ అని పిలుపంచుకోవాలిని ఆశ పడుతూ ఉంటుంది. గర్భం దాల్చినప్పటి నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక గర్భధారణ సమయంలో మహిళలు ఆహార విషయాలు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు.
గర్భధారణ సమయంలో మహిళలకు ప్రోటీన్స్ ఉండే పదార్దాలు ఎక్కువగా తీసుకోవాలి. అయితే కోడిగుడ్లలో ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఇక ప్రొటీన్ల తయారీకి కీలకమైన అమైనో యాసిడ్స్ గుడ్లలో ఉంటాయని అన్నారు. ఇక విటమిన్లు, మినరల్స్ 12కుపైనే దొరుకుతాయి. అంతేకాదు.. వీటిలో కొలైన్ కూడా ఒకటి. అవి శివువు వెన్నెముక నిర్మాణానికి ఇది దోహదపడుతుంది.
ఇక బీన్స్ లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు వాటిలో పీచు కూడా తగినంత ఉంటుంది. అయితే చిలగడదుంపలో ఉండే కెరటోనాయిడ్స్, ప్లాంట్ పిగ్మెంట్లు మన శరీరంలోకి వచ్చిన తర్వాత విటమిన్ ఏ గా రూపాంతరం చెందుతుంది. ఇక విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ సమృద్ధిగా దొరుకుతుంది.
గర్భిణులు ముడి ధాన్యాలు తినడం చాలా మంచిది. అయితే ముడి ధాన్యంలో పీచు, పోషకాలు అధికంగా లభిస్తుంది. అంతేకాక.. యాంటీ ఆక్సిడెంట్లలో ఒకటైన విటమిన్ ఈ, సిలీనియం అనే మినరల్ కూడా దొరుకుతుంది. ఇక కణాలను రక్షించే ఫైటో న్యూట్రియెంట్లు, ప్లాంట్ కాంపౌండ్లు కూడా ఉంటాయి. పీచు, పోషకాలు బార్లీ, ఓట్స్, హోల్ వీట్ ఎక్కువగా దొరుకుతాయి.
గర్భిణులు వాల్ నట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ప్లాంట్ ఆధారిత ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వాల్ నట్స్ లో పుష్కలంగా దొరుకుతాయి. ఇక ప్రొటీన్, ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి. అయితే పాలలో మాంసకృత్తులు, క్యాల్షియం అధికంగా దొరుకుతాయి. ఇక కనీసం రోజులో 500 ఎంఎల్ పాలు తీసుకోవడం అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకవేళ పెరుగు కూడా తగినంత తీసుకునేట్టు అయితే పాలను రోజుకు అరలీటర్ తక్కువ కాకుండా చూసుకోవాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: