అమ్మ: గర్భిణులు మాంసం ఎక్కువగా తినొచ్చా..??

N.ANJI
గర్బధారణ సమాయంలో మహిళలు పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ప్రెగ్నెసీ సమయంలో నాన్‌ వెజ్‌ తినడం మంచిదేనా అనే సందేహాలు వస్తుంటాయి. అయితే నాన్‌ వెజ్‌లో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇక మాంసాహారం గర్భంలో శిశివు ఆరోగ్యం మెరుగుపరచటంతో పాటు పిండం అభివద్ధికి దోహదపడుతుంది. అంతేకాదు.. రెడ్‌ మీట్, వైట్‌ మీట్లలో ఐరన్‌ అధికంగా లభిస్తుంది. ఇక శిశువు మెదడుకు కావాల్సిన ఆక్సిజన్‌ అందించడానికి కూడా రెడ్‌ మీట్‌ సహాయపడుతుంది. అంతేకాదు.. మటన్, పోర్క్, బీఫ్, చికెన్, చేపలు వంటి మాంసాన్ని వారంలో రెండుసార్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే గర్భిణులు సాల్మన్‌ చేపలు ఆరోగ్యానికి మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక వీటిలో ఒమేగా – 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్, విటమిన్‌ ఎ పుష్కలంగా దొరుకుతాయి. ఇక వారంలో రెండు లేదా మూడు సార్లు సాల్మన్‌ చేపలను తీసుకుంటే బిడ్డకు అవసరమైన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక గర్భంలో శిశువు కళ్లు, మెదడు అభివద్ధికి సహాయపడుతాయ ని అన్నారు.
అలాగే గుడ్డులో అమైనో ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి. అందులో కొన్ని ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు లభిస్తాయి. ఇక గుడ్డులో ఉండే సాల్మనెల్ల రసాయనాన్ని తొలిగించేందుకు గుడ్డును కచ్చితంగా ఉడికించాలని ఆ తర్వాతే తినాలని తెలిపారు. అయితే ప్రెగ్నెంట్‌ ఉమెన్‌ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలని చెబుతున్నారు. గర్భిణులు నీళ్లు ఎక్కవగా తీసుకోకుంటే డీహైడ్రెషన్‌ సమస్య వస్తుందన్నారు.
అంతేకాదు.. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు, మాంసాహారం.. ఇలా సమతుల పోషకాహారం ఉండేలా మీ ఫుడ్ ఛార్ట్ ప్రిపేర్ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక లభ్యతను బట్టి, వీలును బట్టి వీటిలో మీకు నచ్చిన ఫుడ్ తీసుకోండి అని అన్నారు. అంతేకాక గర్భిణులు టెన్షన్ పడకూడని అన్నారు. ఇక సాధారణంగా ఐదో నెల ప్రెగ్నెన్సీ తరువాత వైద్యులు దాదాపు 30 నిమిషాలు వాకింగ్ చేయాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: