పానీపూరీని క‌నిపెట్టింది ద్రౌప‌ది నా..? నిజమెంత.. ?

Mamatha Reddy
పానీపూరి.. ప్రస్తుతం ప్రజలు మెచ్చే, ఎంతో ఇష్టం గా తినే స్నాక్.. సాయంత్రం పూట దొరికే ఈ పదార్థం తినడానికి ప్రజలు ఎంతగానో ఆశపడుతుంటారు.. కుర్రకారు దగ్గర్నుంచి ముసలివాళ్ళ దాకా పానీపూరి తింటూ ఈ లోకాన్నే మర్చిపోతుంటారు.. పానీ పూరి రోడ్డుపైన ఎక్కడ దొరికినా సరే గుంపులు గుంపులుగా తింటూ ఆ పానీపూరి పైన ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు.. ప్రస్తుతం ఈ పానీపూరి లో చాలా వెరైటీలు రాగా దేనికవే ఎంతో టేస్టీగా ఉంటూ ప్రజలను ఆకర్షిస్తున్నాయి.. ప్రజలు ఎంతగానో ఇష్టపడి తినే ఈ పానీ పూరి అసలు ఎక్కడ పుట్టింది..అనే స్టోరీ ని ఇప్పుడు తెలుసుకుందాం..
పెళ్లయ్యాక అత్తగారింటికి వచ్చిన ద్రౌపదిని కుంతి పరీక్షించాలి అనుకుందట.. మిగిలిన ఆలుగడ్డ కూర ను ఒక చపాతీ కి మాత్రమే సరిపోయే పిండిని ద్రౌపదికి అందించి తన ఐదుగురు కొడుకుల ఆకలి తీర్చాలని చెప్పిందట.. అప్పుడు ద్రౌపది ఆ వస్తువులతో పానీపూరి తయారు చేసి ఆ ఐదుగురు ఆకలి తీర్చినదట.. అంత తెలివైన పనిచేసిన ద్రౌపది నీ చూసి కుంతి ఎంతగానో సంతోషించిందట.. ద్రౌపది పేరున పానీపూరి శాశ్వతంగా ఉండిపోతుంది దీవించిందట..
అయితే మరి కొందరి వాదన ఎలా ఉంది అంటే అసలు మహాభారతంలో పానీపూరి కి ఉపయోగించాల్సిన వస్తువులు ఉన్నట్లు ఎక్కడా దాఖలాలు లేవు అలాంటిది కుంతి ఎలా ద్రౌపదిని పరిశీలిస్తుందని కొంతమంది అడుగుతున్నారు.. నిజానికి ఆలుగడ్డలను పోర్చుగీసు వారు కనిపెట్టారు మరి మహాభారత కాలంలో ఈ ఆలుగడ్డలు ఎలా వచ్చాయి అనేది ఇప్పటికీ అంతుపట్టని అంశం.. మహాభారత కాలపు ఆహారంలో రొట్టెల ప్రస్తావన ఎక్కడా లేదు మరి కుంతి ద్రౌపది కి ఈ టాస్క్ ఎలా ఇచ్చిందని మరో డౌట్..  నిజంగా పానీపూరి సృష్టికర్త ద్రౌపది అవునో కాదో తెలియదు కానీ గూగుల్ లో సెర్చ్ చేస్తే మాత్రం ఆమె పేరే వస్తుంది.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: