అమ్మ: గ్రహణ సమయంలో గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలు..!

N.ANJI
గ్రహణ సమయంలో గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలు గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సూర్యగ్రహణం సమయంలో గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా. సూర్యగ్రహణం సమయంలో అతినీతలోహిత కిరణాలు చురుగ్గా ఉంటాయి. అందుకే ఆహారం తీసుకోవద్దని చెప్పే మాటలను చాలా మంది విశ్వసిస్తారు. అంతేకాదు గ్రహణం సమయంలో ఆకాశం వైపు నేరుగా చూడొద్దని సలహా ఇస్తుంటారు.

ఎవరు ఎటువంటి నియమాలు పాటించినా పాటించకపోయినా కూడా గర్భిణులు మాత్రం కొన్ని నియమాలు పాటించాలంటూ.. గ్రహణం గురించి పురాణాల్లో అనేక విషయాలు వెల్లడించారు. తినొద్దని, మంచినీళ్లు తీసుకోవద్దని, వెలుగునిచ్చే సూర్యుడు కనిపించని సమయంలో ఏం పని చేయకూడదని తెలుపుతుంటారు. గ్రహణ సమయంలో వారు ఒకేవిధంగా పడుకోవాలని కూడా చెబుతున్నారు. గ్రహణ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు వస్తుంటాయి. అందుకని గర్భిణులపై ఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్త్రాల్లో చెప్పారు.

గర్భవతులకు కడుపులో శిశువు పిండం ఎదుగుతున్న సమయంలో శరీరానికి ఎలాంటి నెగటివ్ పవర్‌ని తట్టుకునే శక్తి ఉండదు. గ్రహణ సమయంలో రోగ నిరోధక శక్తి గర్భంలో ఉన్న బిడ్డ కోల్పోతారు. అందుకే ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. వారిని బయటకు రానివ్వకుండా చూసుకుంటారు. గ్రహణ సమయంలో చేసే దైవ స్మరణ, జపం అనేక రెట్ల శుభ ఫలితాలను ఇస్తాయనేది నమ్మకం.

గ్రహణం పట్టిన సమయానికి మరుసటిరోజు వరకు ముఖ్యమైనవి. దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. గ్రహణం తర్వాత మరుసటి రోజు కేవలం గ్రహణ దోషం ఉన్నవారే కాకుండా పన్నెండు రాశుల వారు గ్రహణ దోష నివారణ కొరకు గోధుమలు, ఉలవలు కిలోంపావు చొప్పున తీసుకుని వాటిని నీళ్ళలో నానబెట్టి మరుసటిరోజు నీళ్ళను వడగట్టిన తర్వాత వాటికి చిక్కగా బెల్లాన్ని పట్టించి ఆవుకు అరటి ఆకులో కాని, మోదుగ, తామర ఆకులతో కుట్టిన విస్తరి ఆకులో దాన పెడితే మంచిది అనేది ఓ నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: