అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

Mamatha Reddy
ఉపవాసం గురించి మనకి తెలిసిందే.మనం తినే అన్నం జోలికి వెళ్లకుండా కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటూ చేసే ఒక దీక్ష లాంటిది. ఉపవాసం ఎన్ని రోజులు చేస్తారు మహా అయితే ఒకరోజు లేదంటే వారం రోజులు కానీ ఒక మహిళా  సంవత్సరాలుగా ఉపవాసం చేస్తూనే ఉంది. ఆ మహిళా ఎవరో కాదు ఊర్మిళ దేవి. ఈమె అన్ని సంవత్సరాలు ఉపవాసం చేయడానికి గల కారణం ఏమిటి? అలాగే ఆమె ప్రస్తుతం ఉపవాసాన్ని విరమించడానికి సిద్ధం అవుతుంది కూడా. ఆ  విషయాల ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ఊర్మిళ దేవి మధ్యప్రదేశ్ కు చెందిన రాముని భక్తురాలు. ఈమె 28 సంవత్సరాల పాటు ఉపవాసం చేస్తుంది. కారణం అయోధ్య వివాదం. అప్పట్లో జరిగిన  బాబ్రీ మసీదు వివాదం గురించి తెలిసిందే. అయితే బాబ్రీ మసీదు-రామ మందిరం  గొడవలు జరుగుతున్న నేపథ్యం లో రామ మందిరం నిర్మాణం జరగాలని ఊర్మిళ దేవి అప్పటినుంచి ఉపవాస దీక్షను  ప్రారంభించింది. ఆలా ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు రామ మందిర నిర్మణాన్ని భారత ప్రభుత్వం.  చేపడుతుంది.
ఇన్ని సంవత్సరాల తర్వాత భారత అత్యున్నత న్యాయస్థానం రామమందిర నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పును తెలిపిందో అప్పుడు ఊర్మిళ దేవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన ఇన్నేళ్ల దీక్షకి ఒక ఫలితం దక్కిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, 1992 సంవత్సరం లో రామ మందిర నిర్మాణం కోసం దేశం లో గొడవలు జరుగుతున్నాయని అప్పుడు ఆమెకు 54 సంవత్సరాలు ఉంటాయి. ఊర్మిళ దేవి  రామ భక్తురాలు కావడంతో ఆమె మనసు చలించి పోయింది  ఆ గొడవ నాటి నుంచి ఆమె  అన్నం తీసుకోవడం మానేసిందని  కేవలం పండ్లనే ఆహారంగా తీసుకుంటూ నిత్యం రామ జపం చేస్తుండేది ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇక తాను అనుకున్నది నెరవేరడంతో త్వరలోనే అయోధ్య రామ మందిరంలో జరిగే ఉత్సవాలకు హాజరవుతానని, మరియు రాముడిని దర్శించి అక్కడి నది వద్ద ఉపవాస దీక్షను విరమిస్తానని ఊర్మిళ దేవి అంటున్నారు. ఇదండీ రామ మందిర నిర్మాణం కోసం ఒక మహిళ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఉపవాస దీక్షను చేయడం. ఒక ఎతైతే ఫలితం దక్కే వరకు దీక్షను ఆపకుండా అలాగే కొనసాగించడం పట్ల చూస్తే ఆమె యొక్క పట్టుదలకు చేతులెత్తి  మొక్కవలసిందే. ఇప్పుడు ఆమె అనుకున్నది సాధించింది. అతి త్వరలో రామ మందిరాన్ని దర్శించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: