వెజిటబుల్ షేర్వా

Durga
ఉల్లిపాయలు - 2 సన్నగా తరిగినవి పచ్చి మిరపకాయలు - 8 నిలువుగా అడ్డంగా తరిగినది అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్ స్పూన్ టమోటాలు - 1 పెరుగు - 1 కప్ కారం: ధనియాల పొడి: పసుపు: ఉప్పు: నూనె : గరం మసాల పొడి: గసగసాలు - 1 టేబుల్ స్పూన్ సాయి పప్పు - 1 టేబుల్ స్పూన్  జీడి పప్పు - 1 టేబుల్ స్పూన్  తురిమిన పచ్చి కొబ్బరి - 1 టేబుల్ స్పూన్ తయారు చేసే విధానము:  ఒక బాండలి లో రెండు స్పూన్లు నూనె పోసి వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించాలి. అందులో అందులో కొంచం ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచం సేపు వేగించాలి. ఇప్పుడు తరిగిన టమోటాలు వేసి వేగించాలి. అందులో పెరుగు, తగినంత కారం, ఉప్పు, చిటికెడు పసుపు, ఒక spoon ధనియాల పొడి, కొంచం నీళ్ళు వేయాలి. ఒక ఐదు నిముషాలు పాటు ఉడికించాలి. ఇప్పుడు తయారు చేసిన గరం మసాల పొడి వేసి కూర చిక్క బడేంత వరకు ఉడికించాలి. అంతే షేర్వ రెడీ.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: