జుట్టుకు రంగు వేసేటప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు. !

Suma Kallamadi
ఈ కాలంలో చాలామంది మహిళలు జుట్టుకు రంగుని వేసుకుంటున్నారు. కొంతమంది తెల్ల జుట్టు కనపడకుండా ఉండడానికి వేసుకుంటారు, మరికొందరు స్టైల్ గా కనిపించడానికి వేసుకుంటారు. జుట్టు కూడా ఆడవాళ్ల అందం విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది  అందుకనే అందంగా కనపడటానికి జుట్టుకి మంచి రంగుని ఎంచుకోవటం చాలా ముఖ్యం. జుట్టు రంగుని మార్చినపుడు అందరికి మీలో మార్పు కనబడుతుంది. కానీ మీ జుట్టుకు రంగు వేసుకునే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే  సరైన రంగుని ఎంచుకోవాలి. మీ జుట్టుకి రంగు ఎంచుకునే సమయంలో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి.. !  జుట్టుకి ఎంచుకునే రంగు తప్పకుండా మీ చర్మానికి సరిపోయేలా చూసుకోవాలి.  మీ చర్మం యొక్క రంగు గులాభి రంగులో ఉన్నట్లయితే మీ జుట్టు రంగు బూడిద రంగులో ఉండేలా చూసుకోవాలి. జుట్టుకి బంగారు గోధుమ రంగు, ఎరుపు రంగులో ఉండే చాయలు లేదా షేడ్స్ వేయకూడదు. చూడడానికి బాగోదు.  




అలాగే లేత రంగు గల చర్మం ఉన్న వారు తప్పకుండా చూడటానికి అందంగా ఉండే రంగులను మాత్రమే ఎంచుకోవాలి.ఆలివ్ రంగు చర్మం ఉన్నవారు, జుట్టుకి ముదురు రంగు వేస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఈ రంగు చర్మం ఉన్న వారు లేత రంగులను జుట్టుకి వేయకూడదు, వారికి చర్మ రంగుకి ఇవి సరిపోవు. మీ చర్మం యొక్క రంగు లేత లేదా పాలిపోయిన రంగులో ఉంటే మీ జుట్టుకి ముదురు రంగులని వేయకూడదు. ఈ రంగు వలన మీరు మరింత లేత రంగులో కనపడే అవకాశం ఉంది. మీ చర్మం రంగు చూడటానికి పసుపు పచ్చ రంగులో ఉంటే, మీ జుట్టుకు పసుపు రంగుని వేయకండి, గోల్డ్ లేదా ఆరెంజ్ రంగు, వత్తుగా ఉండే ఎరుపు లేదా ముదురు గోధుమ రంగు మీకు సరిపోతుంది. చూసారు కదా మరి మీకు ఎలాంటి రంగు సెట్ అవుతుందో చూసుకుని రంగు వేసుకోండి.. !!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: