హెరాల్డ్ స్పెషల్ కర్రీ: ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి తయారీ విధానం మీకోసం...!

Suma Kallamadi
తెలుగు రాష్ట్రాల ప్రజలు తినడానికి ఎంతగానో ఇష్టపడే వాటిలో గోంగూర పచ్చడి ప్రధానమైనదని చెప్పవచ్చు. ఇటు శాకాహారులు, అటు మాంసాహారులు ఎవరైనా సరే బాగా ఇష్టపడి తినే వంటకం ఏదైనా ఉందంటే అందులో మొదటగా వచ్చేది గోంగూర పచ్చడి. మరి ఇలాంటి గోంగూర పచ్చడి రుచికరంగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామా... ముందుగా గోంగూర పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు చూస్తే..  గోంగూర రెండు లేదా మూడు కట్టలు, పచ్చిమిరపకాయలు తగినన్ని, నూనె, ఉల్లిపాయలు 2, వెల్లుల్లి పాయలు, నూనె, ఎండు మిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ అవసరమవుతాయి.

ఇక ఇప్పుడు పచ్చడి తయారీ విధానం విషయానికి వస్తే.. ముందుగా గోంగూరను తీసుకొని నీటిలో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చడికి అవసరమైన అన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని,  వాటిని వెడల్పు బాండీలో కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో గోంగూర వేసి పైన మూత పెట్టి సన్నని మంటపై కొద్దిసేపు ఉడికించాలి. ఇలా ఉడికించడం ద్వారా ఆవిరికి బాండీలో ఉన్న గోంగూర ఒక ముద్దగా తయారీ దగ్గరకు చేరుకుంటుంది. ఇక ఆ తదుపరి స్టవ్ మీద నుండి వాటిని పక్కకు తీసి చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత గోంగూర, పచ్చిమిర్చి ముద్దను తీసి మిక్సీలో కాస్త ఉప్పు కలిపి రుబ్బుకోవాలి.

అలా మిక్సీ వేసిన పదార్థాన్ని మళ్లీ పెన్నంలో కాస్త పోపు వేసి అందులో వేయాలి. ఈ పోపు లో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, మెంతులు, మినపప్పు, ఎండుమిరపకాయలు  కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్ని కలిసి పెట్టుకోవాలి. ఇలా పోపు గింజలు బాగా రెడీ అయ్యాక మనం మిక్సీలో వేసిన గోంగూర ను అందులో వేసి బాగా కలియబెట్టాలి. స్టవ్ మీద నుండి దించి సమయంలో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకా సరిపోకపోతే యాడ్ చేసుకుంటూ అందుకు సరిపడా ఆయిల్ ని కూడా యాడ్ చేసుకుంటే తినడానికి రుచిగా ఉంటుంది. ఇది కూడా సన్నని మంటపై కొద్దిసేపు ఉడికిస్తే చాలా రుచిగా మారుతుంది. ఇంకేముంది మీకు కావాల్సిన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: