కొడుకును తెచ్చుకునేందుకు స్కూటీపై త‌ల్లీ 1400కిలో మీట‌ర్ల ప్ర‌యాణం...

Spyder

కొడుకుపై ఉన్న ఆ త‌ల్లిని స్కూటీపై 1400కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయించేలా చేసింది. అది కూడా లాక్‌డౌన్ ఎంతో క‌ఠినంగా అమ‌ల‌వుతున్న భార‌త్‌లో. వృత్తిరీత్య ఉపాధ్యాయురాలైన ఆ ముస్లిం మ‌హిళ క‌రోనా క‌రాళ నృత్యం చేస్తున్న తెలుగు రాష్ట్రాల గుండా ప్ర‌యాణం సాహ‌స‌యాత్ర చేపట్టింద‌నే చెప్పాలి.   తెలంగాణలోని బోధన్‌కు చెందిన రజియా అనే ఉపాధ్యాయురాలు కుమారుడు నిజాముద్దీన్ కొన్నాళ్ల క్రితం తన స్నేహితుడు ఉంటున్న నెల్లూరులోని రెహ్మతాబాద్‌కు వెళ్లాడు. లాక్ డౌన్ కారణంగా తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయాడు. అయితే ర‌జియా త‌న కొడుకును చూడ‌కుండా ఉండ‌లేక‌పోయింది.


కుమారుడిని అక్క‌డి నుంచి బంధువులతో క‌ల‌సి ర‌ప్పించాల‌ని ఎంతో ప్ర‌య‌త్నంచేసింది. కానీ అవేమీ ఫ‌లించ‌లేదు. దీనికి తోడు
లాక్‌డౌన్ సుదీర్ఘ‌కాలం కొన‌సాగుతుంద‌నే సంకేతాలు వ‌స్తుండ‌టంతో ఎలాగైనా త‌న కొడుకును తీసుకురావాల‌ని నిశ్చ‌యించుకుంది. దీంతో స్కూటీపై  తానే నెల్లూరు జిల్లాకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందుకు స్థానికంగా ఉన్న ఓ పోలీస్ అధికారి వ‌ద్ద నుంచి ఎన్‌వోసీ లెట‌ర్ తెచ్చుకుని బోధ‌న్ నుంచి స్కూటీపై బ‌య‌ల్దేరింది.   ర‌జియా ఏకంగా 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి కన్న కొడుకును తన ఇంటికి తెచ్చుకుంది.  మూడు రోజుల కాలంలో ఆమె ఏక‌ధాటిగా ప్ర‌యాణం సాగిస్తూనే ఉండ‌టం గ‌మ‌నార్హం. 

 

మూడు రోజుల పాటు ఆమె ఎండ, ఆకలి, నిద్ర‌, అలుపు, సొలుపు ఇవేమీ ఆమె ప‌ట్టించుకోలేదు. కేవ‌లం త‌న కొడుకును ఇంటికి చేర్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఆమె స్కూటీపై ప్ర‌యాణం సాగించింది. తన ప్రయాణానికి సహకరించిన ఇరు రాష్ట్రాల పోలీసులకు రజియా కృతజ్ఞతలు తెలిపింది. తాను పడిన కష్టం తనకు లెక్క కాదని... తన కుమారుడిని తిరిగి తన దగ్గరకు తీసుకురావడం తనకు సంతృప్తి కలిగించిందని ఆమె తెలిపింది. ఇప్పుడు ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ర‌జియాను తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు కొనియాడుతున్నారు. అమ్మ‌ని మించిన దైవం లేద‌ని అందుకే అంటారు అంటూ కొంత‌మంది నెటిజ‌న్లు కామెంట్ల రూపంలో త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: