స్పెషల్ కడాయి మటన్ గ్రేవీ ఎప్పుడైనా తిన్నారా?

Durga Writes

కావల్సిన పదార్థాలు:

 

మటన్ - 750 గా"

 

ఉల్లిపాయలు- 2 కప్స్ 

 

టమోటోలు - 1 కప్ 

 

అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీస్పూన్ 

 

పచ్చిమిర్చి - 6

 

కారం - 1/2 టీస్పూన్ 

 

గరం మసాలా - 1/2 టీస్పూన్ 

 

మీట్ మసాలా పౌడర్ - 1/2 టీస్పూన్ 

 

ధనియాల పొడి - 1/2 టీస్పూన్ 

 

పసుపు - 1/2 టీస్పూన్ 

 

కస్తూరి మేతి - 1/2 టీస్పూన్ 

 

కొత్తిమీర- 1/2 కప్ 

 

ఉప్పు: రుచికి సరిపడేంత

 

నూనె: తగినంత

 

తయారీ విధానం.. 

 

కుక్కర్ లో మటన్ , కొద్దిగా పసుపు వేయాలి. ఆతర్వాత అందులో నీళ్ళు సోసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. అనంతరం కుక్కర్ లో ప్రెజర్ తగ్గిన తర్వాత, పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. కాగే నూనెలో కుక్కర్లో ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. ఆలా చేసిన 5 నిముషాల తర్వాత ఉల్లిపాయలు, టమోటోలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాలపొడి, గరం మసాలా, కారం వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. ఆ తర్వాత అందులో సరిపడా నీళ్ళు వేసి కస్తూరి మేతీ.. మీట్ మసాలా పౌడర్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి. 15 నిముషాలు ఉడికిన స్టవ్ ఆఫ్ చెయ్యాలి. అంతే కడాయి మటన్ గ్రేవీ రెడీ. ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఆ గ్రేవీ తినండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: