అరటికాయ పొడి తిన్నారా? ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?

Durga Writes

అరటికాయపొడి అంటే చాలామందికి తెలియదు.. కానీ ఆ అరటికాయ చాలా రుచిగా ఉంటుంది. అయితే అసలు ఈ పొడి పేరు తెలియదు.. రుచి తెలియదు. అందుకే దీని గురించి ఎవరికి ఎక్కువ తెలియదు. అలాంటి వారంతా ఈ అరటికాయ పొడి ఎలా చేయాలి అనేది తెలుసుకొని చేసుకొని తినండి. అద్భుతంగా ఉంటుంది. 

 

కావలసిన పదార్థాలు... 

 

అరటి కాయలు - చిన్నవి 2, 

 

దనియాలు, శనగపప్పు, నూనె - 1 స్పూను, 

 

మినప్పప్పు - 2 టేబుల్‌ స్పూన్లు, 

 

ఎండుమిర్చి - 8, 

 

చింతపండు - 2 రెబ్బలు, 

 

వెల్లుల్లి రేకులు - 4, 

 

ఉప్పు - రుచికి తగినంత.

 

తయారీ విధానం... 

 

తొక్కతీసిన అరటి కాయల్ని గుండ్రంగా, సన్నగా తరిగి, టీ స్పూను నూనెలో దోరగా వేగించాలి. రెండు టీ స్పూన్ల నూనెలో దనియాలు, శనగపప్పు, మినప్పప్పులను విడివిడిగా వేగించాలి. చివర్లో ఎండుమిర్చి కూడా వేసి వేగించి చల్లారిన తర్వాత అన్నీ కలిపి చింతపండు, ఉప్పు, వెల్లుల్లి చేర్చి బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. అంతే అరటిపండు పొడి రెడీ అయిపోతుంది. ఈ అరటి పండు పొడిని అన్నంలోకి.. లేదా ఉప్మా లాంటివాటిలోకి కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: