గోంగూర చేప కర్రీ

Vamsi
కావలసిన పదార్థాలు: 
గోంగూర: నాలుగు కట్టలు(ఎర్రని కాడలు ఉన్న గోంగూర) 
చేపలు: 1/2kg 
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp 
కొత్తిమీర: ఒక కట్ట చెక్క,లవంగాలు: 3 
ధనియాలపొడి: 1tsp 
కారం: 1tsp 
పసుపు: చిటికెడు 
ఉల్లిపాయలు: 2 
టమోటో: 1 
కరివేపాకు: రెండు రెబ్బలు 
ఎండుమిర్చి: 2 
మెంతులు: 1/2tsp 
మిరపపొడి: 3tsp 
ఉప్పు: రుచికి తగినంత 
పచ్చి మిరపకాయలు: 4-6 
నూనె: కావలసినంత 
తయారు చేయు విధానం: 
ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఆవాలు, కరివేపాకు, మెంతులు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి. - తరువాత చేప ముక్కలు వేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. 

నీరంతా ఇంకిపోయిన తరువాత మిరపపొడి, దనియా, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చెక్కా, లవంగాలు, టమోటోముక్కలు వేసి ఉడికించి చివరగా కొంచెం చింతపులుసు వేపి ఉడకనిచ్చి దింపుకోవాలి.  ఈ మిశ్రమాన్ని ఉడికించి పెట్టుకున్న గోంగూరతో కలుపుకుని, ఎండుమిర్చి నూనెలో వేయించిఅందులో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే..గోంగూర ఫిష్ కర్రీ రెడీ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: