బీట్రూట్ బిర్యాని!

Durga
కావలసిన పదార్థాలు:    బీట్రూట్ – 1 కప్ చిన్న ముక్కలుగా తరిగినవి   బియ్యం – 4 గ్లాస్సలు   ఉల్లిపాయలు – 2 తరిగినవి   పుదినా – 1 కప్ సన్నగా తరిగినది   కొత్తిమీర – అర కప్ తరిగినది   పచ్చి మిరపకాయలు – 10 నిలువుగా కట్ చేసినవి   అల్లం వెల్లుల్లి పేస్టు – 1 tablespoon ధనియాల పొడి – 2 tablespoons గరం మసాల పొడి – 1 tablespoon   కారం – 1 tablespoon   పసుపు – 1 teaspoon  మిరియాలు – కొన్ని  మసాల ఆకు – 4  పట్ట – 1 /4 th  మొగ్గ – 3  ఉప్పు – తగినంత  నూనె - తగినంత తయారు చేసే విధానం :   ముందుగా నీళ్ళల్లో బియ్యం ని అర్ధ గంట పాటు నాన పెట్టుకోవాలి. ఒక గిన్నె లో తగినంత నూనె పోసుకోవాలి. వేడి అయ్యాక అందులో మసాల ఆకు, పట్ట, మొగ్గ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అందులో బీట్రూట్ , అల్లం వెల్లుల్లి వేసి మరో ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి.  ఇప్పుడు బియ్యం తప్ప పైన చెప్పిన మిగిలిన పదార్తలన్నిటిని వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. వేగాక అందులో నాన పెట్టి వదర్చిన బియ్యం ని వేసి రెండు నిముషాల పాటు వేయించి అందులో 8 గ్లాస్సు ల నీళ్ళు పోసి మీడియం మంట మీద అన్నం పూర్తిగా ఉదికేదాక ఉడికించుకోవాలి. అంతే బీట్రూట్ బిర్యాని

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: