ఉసిరికాయ రసం

Durga
 కావలసిన పదార్థాలు :  ఉసిరికాయలు : 8 ఎండుమిర్చి : 2 ఆవాలు : పావు టీ.స్పూను జీలకర్ర : పావు టీ.స్పూను వెల్లుల్లి : 5 రెబ్బలు ధనియాల పొడి : ఒకటిన్నర టీ. స్పూను  మిరియాల పొడి : పావు టీ. స్పూను  కరివేపాకు : రెండు రెమ్మలు కొత్తిమీర : ఒక కట్ట ఉప్పు : తగినంత పప్పు తేట : గరిటెలు తయారీ విధానం : ఉసిరికాయలను రెండుగా విడదీసి ఆ ముక్కల్లో రెండుగ్లాసుల నీళ్లు పోసి ఉడికించి, తరవాత వడగట్టాలి. విడిగా ఓ గిన్నెను తీసుకుని కొద్దిగా నూనెవేసి ఆవాలు, జీలకర్రలతో తాలింపుపెట్టి అందులో పప్పుతేట, వడగట్టిన ఉసిరిరసం కలిపి స్టవ్‌మీద పెట్టాలి. రసం కాస్త మరగగానే దంచిన వెల్లుల్లి, ధనియాలపొడి, మిరియాలపొడి, కొత్తిమీర, కరివేపాకు వేసి 5 నిమిషాల తరువాత దించాలి. చివరగా ఉప్పు సరిచూడాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీలలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరూ ట్రై చేయండి మరి..!!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: