రొయ్యల ప్రైడ్ రైస్

Durga
కావలిసిన పధార్థాలు :    రొయ్యలు : 1 కప్పు కార్న్ ఫ్లోర్ : 2 టే స్పూను  మైదా :  1 టే స్పూను  చిల్లి సాస్ : 1 టే స్పూను  సోయ్ సాస్ : 1 టే స్పూను కోడి గ్రుడ్డు: 1 కారం ఫ్రైడ్ రైస్ కోసం :  బియ్యం :  2 కప్పులు బీన్స్ : 1 కప్పు తరిగినది కారట్స్:  కప్పు సన్నగా తరిగినవి ఉల్లిపాయలు : 1 కప్పు తరిగినది క్యాబేజీ: 1 కప్పు తరిగినది పచ్చి మిరపకాయలు: 10 సన్నగా తరిగినవి కొత్తిమీర: 1 /2 కప్పు తరిగినది కోడి గ్రుడ్లు :  2 తయారీ చేయువిధానం :    చిల్లి సాస్ సోయ్ సాస్ అజినోమోటో ఉప్పు నూనె తయారు చేసే విధానము ముందుగ కార్న్ ఫ్లోర్, మైదా , చిల్లి సాస్, సోయ్ సాస్, తగినంత కారం, ఉప్పు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గ్రుడ్డు ని గిలకోట్టుకొని పెట్టుకోవాలి. పైన చెప్పిన పదార్థాలు అన్నిటిని గ్రుడ్డు వేసి పేస్టు లాగ కలుపుకోవాలి. ఇప్పుడు రొయ్యలను వేసి బాగా కలపాలి. ఒక బాండలి లో deep ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగాక రొయ్యలు ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినవాటిని పక్కన పెట్టుకోవాలి. చెప్పిన కూరగాయలు అన్నిటిని చూపించిన విధం గ తరిగి పెట్టుకోవాలి. బియ్యం ని నీళ్ళల్లో అర్ధ గంట పాటు నాన పెట్టుకోవాలి. తరువాత నీళ్లన్నీ వంచేయాలి. వేరే గిన్నె లో 4 గ్లాస్ ల నీళ్ళు పోసి కాగ పెట్టుకోవాలి. అందులో రెండు గరిటెల నూనె పోసి నాన పెట్టిన బియ్యం ని కూడా వేసి 3 /4 ఉడికేంత వరకు ఉడికించాలి. నీల్ల్లని వడార్చి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండలి లో రెండు గరిటెల నూనె పోసి వేడి చేసుకోవాలి. అందులో గిలకోట్టుకొన్న రెండు గ్రుడ్లను వేయాలి. ఒక నిముషం తరువాత ఈ ఆమ్లెట్ ని ముక్కలుగా చేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి. వేగాక అన్ని కూరగాయ ముక్కలను కూడా వేసి అవి మగ్గెంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉదికిన్చుక్న్న అన్నం, 1టేబుల్ స్పూను చిల్లి సాస్, 1టేబుల్ స్పూను సోయ్ సాస్, చిటికెడు అజినోమోటో, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అన్ని బాగా కలిసెంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చేసి పెట్టుకొన్న రొయ్యలను కూడా వేసి కలపాలి. ఆఖరున కొత్తిమీర కూడా చల్లి దించేయాలి. అంతే వేడి వేడి రొయ్యల ఫ్రైడ్ రైస్ తయార్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: